Wanaparthy: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!
Wanaparthy: మియాపూర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన చిన్నమందడి యువకుడు భరత్ కుటుంబాన్ని వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.
Wanaparthy: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి.. కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే!
Wanaparthy: రోడ్డు ప్రమాదంలో యువకుడు జనిగే భరత్ (తండ్రి ఆశన్న) మృతి చెందడం తీవ్ర విషాదకరమని వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి విచారం వ్యక్తం చేశారు.
బీటెక్ పూర్తి చేసుకొని గత మూడు నెలలుగా సైట్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న భరత్ విధులకు వెళ్తున్న సమయంలో హైదరాబాద్‌లో మియాపూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో వనపర్తి జిల్లా చిన్నమందడి గ్రామం చెందిన భరత్ బస్సు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరమన్నారు.
చిన్న వయసులోనే కుటుంబానికి అండగా నిలవాల్సిన యువకుడు ఇలా ఆకస్మికంగా మృత్యువాత పడటం కుటుంబానికి తీరని లోటని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు.
కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి మనోధైర్యం కల్పించారు. తక్షణ సహాయంగా రూ.10,000 ఆర్థిక సాయం అందజేశారు. ఈ కష్టకాలంలో కుటుంబ సభ్యులు ధైర్యంగా ఉండాలని, వారికి అండగా ఉంటామని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.
కార్యక్రమంలో సర్పంచ్ భర్త వెంకటస్వామి ఉపసర్పంచి వాకిటి రవి కాంగ్రెస్ కార్యకర్తలు జెనిగేబాలకృష్ణ, సుఖ మన్నెం గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.




