Wanaparthy: వనపర్తి జిల్లాలో పది విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు
Wanaparthy: వనపర్తి జిల్లా పెబ్బేరులో పదో తరగతి విద్యార్థులను ఎమ్మెల్యే మేఘారెడ్డి ఘనంగా సన్మానించారు.
Wanaparthy: వనపర్తి జిల్లాలో పది విద్యార్థుల ప్రతిభకు గుర్తింపు
వనపర్తి జిల్లా: పెబ్బేరు మండలంలో పదో తరగతి విద్యార్థుల ప్రతిభకు ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ ఎమ్మెల్యే మెగా రెడ్డి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కంచిరావుపల్లి గ్రామంలో రైస్ మిల్ ప్రారంభోత్సవం అనంతరం, బాలికల విద్యాభివృద్ధికి ముఖ్యంగా కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం కోసం రూ.44 లక్షల వ్యయంతో అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు కోసం మెరుగైన సదుపాయాలు కల్పించడంపై ఆయన దృష్టి సారించారు.
అనంతరం పెబ్బేరు మున్సిపాలిటీలో జరిగిన కార్యక్రమంలో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో KDR సంస్థకు ప్రోప్రైటర్ దయాకర్ రెడ్డి సౌజన్యంతో విద్యార్థులకు నగదు పారితుషికాలను ఎమ్మెల్యే మెగా రెడ్డి చేతుల మీదుగా అందజేశారు. చదువులో రాణించిన విద్యార్థులను ప్రోత్సహించడం ద్వారా భవిష్యత్తులో మరింత ఉన్నత లక్ష్యాలను సాధించాలని ఆయన సూచించారు. చిరుతపులి, జింక పరుగు పందెం గురించి చెబుతూ విద్యార్థులకుడా చిరుత పులిలా టార్గెట్ పెట్టుకొని చదువుకుంటే ఉన్నత స్థాయిలో ఉంటారని వారిని ప్రోత్సహిస్తూ ఘనంగా సన్మానించి విద్యార్థులను అభినందించారు.
ఈ కార్యక్రమం విద్యార్థుల్లో ఉత్సాహాన్ని నింపడంతో పాటు, వారి కృషికి గుర్తింపుగా నిలిచింది. మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో జరిగిన ఈ సన్మాన సభలో మున్సిపల్ వైస్ చైర్మన్ సుమిత్ర, మార్కెట్ వైస్ చైర్మన్ విజయవర్ధన్ రెడ్డి, కౌన్సిలర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు యువకులు తదితరులు పాల్గొన్నారు.




