Wanaparthy: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ: రూ.11 కోట్ల పరిహారం జమ!

Wanaparthy: వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవతో బుద్ధారం, కేశంపేట భూ నిర్వాసిత రైతుల ఖాతాల్లో రూ.11 కోట్ల పరిహారం జమ అయ్యింది.

S.NAGESH, WANAPARTHY
Published on: 26 Nov 2026 8:08 PM IST
Wanaparthy
X

Wanaparthy: ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి ప్రత్యేక చొరవ: రూ.11 కోట్ల పరిహారం జమ!

వనపర్తి: వనపర్తి నియోజకవర్గంలోని బుద్ధారం, కేశంపేట గ్రామాల భూ నిర్వాసిత రైతులకు రూ.11 కోట్ల పరిహారం అందేలా వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి గారు ప్రత్యేక చొరవ తీసుకున్నారు.

భూసేకరణ కారణంగా భూములు కోల్పోయి పరిహారం కోసం ఎదురుచూస్తున్న రైతుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, పరిహారం అందించే ప్రక్రియ వేగవంతం అయ్యేలా ఎమ్మెల్యే కృషి చేశారు.

ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో బుద్ధారం, కేశంపేట గ్రామాలకు చెందిన రైతుల ఖాతాల్లో పరిహారం నిధులు జమ కావడంతో భూ నిర్వాసిత కుటుంబాలకు ఆర్థిక భరోసా చేకూరింది

రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు చేపట్టడం పై అన్నదాతలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రైతుల ప్రయోజనాలను కాపాడుతూ, భూ నిర్వాసితులకు అందాల్సిన పరిహారం అందించే దిశగా ప్రభుత్వం, ప్రజాప్రతినిధుల సమన్వయంతో చర్యలు కొనసాగుతున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY