Wanaparthy: వనపర్తిలో కాంగ్రెస్ భారీ ఎద్దుల బండ్ల ర్యాలీ
Wanaparthy: వనపర్తి జిల్లా కేంద్రంలో పెంచిన పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఎద్దుల బండ్లతో భారీ ర్యాలీ నిర్వహించారు.
Wanaparthy: వనపర్తిలో కాంగ్రెస్ భారీ ఎద్దుల బండ్ల ర్యాలీ
వనపర్తి జిల్లా: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రం లోని ప్రధాన రహదారుల గుండా ఎద్దులబండ్లతో భారీ ర్యాలీ పాల్గొన్న ఎమ్మెల్యే తూడిమేఘారెడ్డి, స్పోర్ట్స్ చైర్మన్ శివసేనారెడ్డి .. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
రాజీవ్ చౌరస్తాలో ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి మాట్లాడుతూ
మన భారత దేశంలో ఐదు రాష్ట్రాలలో ఎలక్షన్ అయినప్పుడు ప్రధానమంత్రి అబద్ధాలు చెప్పి మోసం చేసి అధికారంలోకి వచ్చి నాలుగుసార్లు పెట్రోల్ డీజిల్ గ్యాస్ ధరలు పెంచడంతోపాటు వేరే వస్తువుల మీద కూడా రేట్లు పెంచారు దానికి వ్యతిరేకంగా రాష్ట్ర పార్టీ పిలుపుమేరకు జిల్లా పార్టీ అధ్యక్షుడు శివసేనారెడ్డి ఆధ్వర్యంలోఆధ్వర్యంలో ఈ కార్యక్రమంలో నిర్వహిస్తున్నామని తక్షణమే ప్రధానమంత్రి పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గించకుంటే రాబోయే రోజుల్లో మండల స్థాయిలో కూడా ధర్నాలు పెద్ద ఎత్తున చేసి ధరలు దిగే వరకు మా కాంగ్రెస్ పార్టీ పోరాటాలు ఆపదని హెచ్చరించారు.




