Mahabubnagar: మహబూబ్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ ప్రారంభం!
Mahabubnagar: మహబూబ్‌నగర్‌లో రూ.1.50 కోట్ల వ్యయంతో సుందరీకరించిన మినీ ట్యాంక్‌బండ్‌ను ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, కలెక్టర్ ఖుష్బూ గుప్తా ప్రారంభించారు.
Mahabubnagar: మహబూబ్‌నగర్ మినీ ట్యాంక్‌బండ్ సుందరీకరణ ప్రారంభం!
Mahabubnagar: దసరా పండుగ వేళ మహబూబ్‌నగర్ వాసులకు ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి గారు తీపి కబురు అందించారు. రూ.1.50 కోట్ల వ్యయంతో మినీ ట్యాంక్‌బండ్‌పై పూర్తి చేసిన సుందరీకరణ పనులు, చిల్డ్రన్స్ ప్లే ఏరియాతో కూడిన ఎంటర్‌టైన్‌మెంట్ జోన్‌ను జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా గారితో కలిసి ఆయన ఘనంగా ప్రారంభించారు.
ముడా (MUDA) నిధుల సహకారంతో, డ్రిప్ సిస్టమ్ వంటి ఆధునిక సాంకేతికతతో సిద్ధం చేసిన ఈ ప్రాజెక్టును పండుగ సెలవుల నాటికే అందుబాటులోకి తెచ్చిన సిబ్బందిని ఆయన అభినందించారు. నాణ్యమైన వాకింగ్, యోగా, సామాజిక వాతావరణాన్ని అందించడమే లక్ష్యమని, మున్ముందు ఈ ప్రాంతాన్ని మరింత విస్తృతంగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ప్రజలు ఈ సదుపాయాలను పరిశుభ్రంగా కాపాడుకోవాలని కోరుతూ... పార్కు పరిసరాల్లో నిరంతరం పారిశుద్ధ్యం, భద్రత పాటించాలని అధికారులను ఆదేశించారు.




