Wanaparthy: వనపర్తి జిల్లాలో తల్లీకూతుళ్ల అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు!

Wanaparthy: పానగల్ మండలం మల్లాయిపల్లికి చెందిన తల్లీకూతుళ్లు దానమ్మ, నాగేశ్వరి వనపర్తి ఆసుపత్రికి వెళ్లి అదృశ్యమవడంతో టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

S.NAGESH, WANAPARTHY
Published on: 25 Nov 2026 11:01 PM IST
Wanaparthy
X

Wanaparthy: వనపర్తి జిల్లాలో తల్లీకూతుళ్ల అదృశ్యం.. ఆచూకీ కోసం పోలీసుల గాలింపు!

వనపర్తి జిల్లా: పానగల్ మండలం, మల్లాయిపల్లి గ్రామానికి చెందిన చింతకుంట్ల పరమేష్ (వయస్సు: 40 సం||, తండ్రి: కీ.శే. చిన్న నర్సింహులు) ఇచ్చిన ఫిర్యాదు మేరకు వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్‌లో మహిళల అదృశ్యం (Women Missing) కేసు నమోదు చేయబడింది.

ఫిర్యాదు వివరాల ప్రకారం, 24-11-2026 తేదీ ఉదయం సుమారు 10:30 గంటల సమయంలో ఫిర్యాదుదారుడి తల్లి మరియు చెల్లెలు వనపర్తిలోని ఆసుపత్రికి వెళ్తున్నామని ఇంట్లో చెప్పి బయలుదేరారు. సాయంత్రం అయినా తిరిగి ఇంటికి రాకపోవడంతో వనపర్తిలో మరియు బంధువుల ఇళ్లలో వెతికినప్పటికీ వారి ఆచూకీ లభ్యం కాలేదు.

అదృశ్యమైన వారి వివరాలు:

1. చింతకుంట్ల దానమ్మ (వయస్సు: 64 సంవత్సరాలు)

సంబంధం: భర్త కీ.శే. చిన్న నర్సింహులు (ఫిర్యాదుదారుడి తల్లి)

వృత్తి: కూలి

ఆనవాళ్లు (దుస్తులు): ఇంటి నుండి వెళ్లేటప్పుడు ఎరుపు రంగు జాకెట్ మరియు నీలం రంగు చీర ధరించి ఉన్నారు.

2. చింతకుంట్ల నాగేశ్వరి (వయస్సు: 23 సంవత్సరాలు)

సంబంధం: తండ్రి కీ.శే. చిన్న నర్సింహులు (ఫిర్యాదుదారుడి చెల్లెలు)

వృత్తి: కూలి

ఆనవాళ్లు (దుస్తులు): ఇంటి నుండి వెళ్లేటప్పుడు నీలం రంగు పంజాబీ డ్రెస్ ధరించి ఉంది..

S.NAGESH, WANAPARTHY

S.NAGESH, WANAPARTHY