Mahabubnagar: అప్పంపల్లి అమరవీరుల స్థూపానికి ఎంపీ డీకే అరుణ నివాళి!
Mahabubnagar: అప్పంపల్లి అమరవీరుల స్థూపానికి నివాళులర్పించిన ఎంపీ డీకే అరుణ. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని డిమాండ్.
Mahabubnagar: అప్పంపల్లి అమరవీరుల స్థూపానికి ఎంపీ డీకే అరుణ నివాళి!
Mahabubnagar:తెలంగాణ విమోచన దినోత్సవం వారోత్సవాలలో భాగంగా మహబూబ్ నగర్ జిల్లా కౌకుంట్ల మండలం అప్పంపల్లి గ్రామంలో అమరవీరుల స్థూపానికి నివాళులు అర్పించిన ఎంపీ డీకే అరుణ.
ఈ సందర్భంగా మాట్లాడుతూ,రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ అమరవీరులను స్మరించుకునేలా వారోత్సవాలు నిర్వహిస్తుందన్నారు.
మహబూబ్ నగర్ జిల్లా అప్పంపల్లి గ్రామంలో 1947 అక్టోబర్ 7వ తేదీన బెల్లం నాగన్న నాయకత్వంలో రజాకార్ల అరాచకాలకు ఎదురు తిరిగి పోరాటం చేసి 11 మంది అమరులైనారు.అనేక మంది గాయపడ్డారు.నిజాం రజాకార్ల నిరంకుశత్వానికి ఈ రావి చెట్టు సజీవ సాక్ష్యం అని తెలిపారు.
దేశమంతా 1947 ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర్యం వస్తె తెలంగాణ కు మాత్రం స్వతంత్ర్యం రాలేదు. తెలంగాణ ప్రాంతంలో రజాకార్ల అరాచకాలను కేంద్ర హోం మంత్రి సర్దార్ పటేల్ తెలుసుకొని హైదరాబాద్ ను, భారత యూనియన్ లో విలీనం చేసేందుకు పోలీసు చర్య నిర్వహించారన్నారు.
సెప్టెంబర్17వ తేదీన జరిగే విమోచన దినోత్సవం సందర్భంగా సమరయోధులను స్మరించుకోవాల్సిన బాధ్యత మన అందరి పై ఉందని గుర్తు చేశారు.
ఉద్యమ సమయంలో BRS అనేక మాటలు చెప్పింది,కానీ విమోచన దినోత్సవం అధికారికంగా జరపలేదు. అదే బాటలో కాంగ్రెస్ కూడా ఒక వర్గం మెప్పు కోసం విమోచన దినోత్సవం అధికారికంగా నిర్వహించడం లేదని అన్నారు.
ప్రతి సంవత్సరం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో విమోచన దినోత్సవం కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నాం. ఈ సంవత్సరం కూడా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ పాల్గొనబోతున్నారని తెలిపారు.
అప్పంపల్లి అమర వీరుల త్యాగం,చరిత్ర చెదిరిపోదు. అమరుల రక్తంతో తడిసిన ఈ అప్పంపల్లి నేల పవిత్రమైనది.
ఈ కార్యక్రమంలో రతంగ్ పాండు రెడ్డి, పగడాకుల శ్రీనివాస్, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, పవన్ కుమార్ రెడ్డి,ప్రశాంత్ రెడ్డి, బలరాం రెడ్డి,విష్ణువర్ధన్ రెడ్డి ,జనార్ధన్ రెడ్డి ,కార్పొరేటర్ కిరణ్ కుమార్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి,యజ్ఞ భూపాల్ రెడ్డి, రఘురామయ్య,తిరుపతి రెడ్డి, లక్ష్మీ శ్యామ్ సుందర్,రమేష్,కేశవ రెడ్డి, సర్పంచ్ మనోహర్ రెడ్డి, కృష్ణవర్ధన్ రెడ్డి, వీరబ్రాహ్మచారి,చెన్నారెడ్డి, రాజు, కర్నె స్వామి,బుచ్చిరెడ్డి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.




