Nagarkurnool: రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిలపై ఫిర్యాదులు..ఎంపీ మల్లు రవి!

Nagarkurnool: రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిలపై ఫిర్యాదులు అందాయని నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి అచ్చంపేటలో తెలిపారు. క్రమశిక్షణ దాటితే చర్యలు తప్పవని హెచ్చరించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 22 Nov 2026 12:49 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిలపై ఫిర్యాదులు..ఎంపీ మల్లు రవి!

Nagarkurnool: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, జడ్చర్ల ఎమ్మెల్యే జనంపల్లి అనిరుద్ రెడ్డిలు పార్టీ క్రమశిక్షణ లక్ష్మణ రేఖను అతిక్రమించారని పలు ఫిర్యాదులు తమకు అందాయని పీసీసీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, నాగర్ కర్నూల్ పార్లమెంటు సభ్యులు డాక్టర్ మల్లు రవి పేర్కొన్నారు.

అచ్చంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజగోపాల్ రెడ్డి, అనిరుద్ రెడ్డిల వ్యవహారశైలిపై కార్యకర్తలు, నాయకుల నుంచి ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. ఈ విషయాన్ని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు.

టీపీసీసీ అధ్యక్షులు ఈ అంశాన్ని ఏఐసీసీ సెక్రటరీ, తెలంగాణ రాష్ట్ర ఇన్‌చార్జ్ సందీప్ కుమార్ దృష్టికి తీసుకువెళ్లారని చెప్పారు. దీనిపై నేరుగా ఇరువురు ఎమ్మెల్యేలతో ఆదివారం మాట్లాడడం జరుగుతుందని పేర్కొన్నారు.

సాయంత్రం జరిగే పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశంలో ఈ అంశంపై చర్చించనున్నట్లు ఎంపీ మల్లు రవి వెల్లడించారు. పార్టీలో క్రమశిక్షణకు అందరూ కట్టుబడి ఉండాలని, ఎవరైనా లక్ష్మణ రేఖ దాటితే చర్యలు తప్పవని ఆయన స్పష్టం చేశారు. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA