Pebbair: రంగాపురంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఎంపీడీఓ
Pebbair: వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం రంగాపురంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను ఎంపీడీఓ వెంకటేష్ పరిశీలించి, నిర్మాణ బిల్లులు నేరుగా ఖాతాల్లో జమ చేస్తామని తెలిపారు.
Pebbair: రంగాపురంలో ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను పరిశీలించిన ఎంపీడీఓ
వనపర్తి జిల్లా: పెబ్బేరు మండలం రంగాపురం గ్రామంలో గురువారం ఇందిరమ్మ ఇళ్ల స్థలాలను ఎంపీడీఓ వెంకటేష్ పరిశీలించారు. లబ్ధిదారులకు కేటాయించిన స్థలాల వివరాలను తెలుసుకుని, ప్రభుత్వం నిర్దేశించిన విధంగా ఇళ్ల నిర్మాణాలు చేపట్టాలని సూచించారు.
నిర్మాణ బిల్లుల నగదును నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని, ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం అవసరమైన సహకారం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి ప్రదీప్ కుమార్, ఉపసర్పంచ్ నందీశ్వర్, గ్రామ కాంగ్రెస్ అధ్యక్షుడు కావలి బాలస్వామి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.




