Urkonda: ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి!
Urkonda: ఊరుకొండ తహసీల్దార్‌కు బీజేపీ నేత ముచ్చర్ల జనార్దన్ రెడ్డి వినతిపత్రం. ఫసల్ బీమా యోజన అమలు చేయాలని డిమాండ్. కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు.
Urkonda: ఫసల్ బీమా పథకాన్ని వెంటనే అమలు చేయాలి!
Urkonda: భారత్ పై విదేశీయుల కుట్ర భారతదేశంపై విదేశీయులైన అమెరికా శ్రీలంక పాకిస్తాన్ బంగ్లాదేశ్ తో పాటు స్వదేశంలోని బిజెపి హిందూ వ్యతిరేక శక్తులు ఏకమై భారత్ ను విచ్చిన్నం చేసేందుకు కుట్ర చేస్తున్నారని బిజెపి రాష్ట్ర నేత ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తెలిపారు.. సిజేపి ముసుగులో ఆప్ కాంగ్రెస్ డ్రామా ఆడుతున్నాయని విమర్శించారు కాంగ్రెస్ అంటేనే విదేశీ శక్తులకు తొత్తు అని మరోసారి నిరూపణ అయిందని భారతదేశాన్ని విచ్ఛిన్నం చేయడమే కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఎజెండా అంటూ ముచ్చర్ల జనార్దన్ రెడ్డి తెలిపారు..
నాగర్ కర్నూల్ జిల్లా ఊరుకొండ మండల కేంద్రంలో ఫసల్ బీమా పథకం బిజెపి ప్రవేశపెట్టిన పథకం తెలంగాణలో అమలు కావడం లేదు అంటూ తాసిల్దార్ కు వినతిపత్రం అందజేశారు. అనంతరం బిజెపి రాష్ట్ర నాయకులు ముచ్చర్ల జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో ఆరుగులైన ప్రతి రైతుకు ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అమలు చేయాలన్నారు డిమాండ్ చేశారు.
ప్రకృతి విపత్తుల పట్టణ గ్రామాల్లో రైతులు నష్టాలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న రైతుకు రైతులకు పంట బీమా పథకం ఎంతో రక్షణ కలిగిస్తుందని తెలిపారు.రైతన్నలకు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమా పథకం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. మన భారతదేశంలో బిజెపి పార్టీ అంచెలంచెలుగా ఎదిగి భారతదేశానికి వన్నెతెచ్చే తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఏదో ఒక పేరుతో బిజెపి పార్టీ పై బురద జల్లుతూ దేశద్రోహులకు సపోర్ట్ చేస్తుందన్నారు. ఈ సందర్భంగా హెచ్చరించారు.




