Achampet: సీఎం ఒక్కరోజు పర్యటన కోసం రోడ్డున పడ్డ 30 చిరు వ్యాపారుల కుటుంబాలు!
Achampet: సీఎం రేవంత్ పర్యటన సందర్భంగా అచ్చంపేట లింగాల రోడ్డు పక్కన నోటీసులు లేకుండా 30 చిరు వ్యాపారుల డబ్బాలను తొలగించడంపై బాధితులు మండిపడ్డారు. (143 అక్షరాలు)
Achampet:సీఎం ఒక్కరోజు పర్యటన కోసం రోడ్డున పడ్డ 30 చిరు వ్యాపారుల కుటుంబాలు!
Achampet: సీఎం ఒక్కరోజు పర్యటన సందర్భంగా రోడ్డున పడ్డ 30మంది చిరు వ్యాపారస్తుల కుటుంబాలు అచ్చంపేట, ప్రభాత ఉదయంనవంబర్ 25అచ్చంపేట పట్టణంలోని లింగాల రోడ్ ప్రక్కన డబ్బాలను వేసుకొని 30,40 కుటుంబాలు చిరు వ్యాపారం చేసుకొని జీవనం కొనసాగించేవారు. ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి పర్యటన సందర్భంగా ఎన్నో రోజులుగా జీవన కొనసాగిస్తున్న వారికి ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి తొలగించడం పై చిరు వ్యాపారస్తులు సీఎం, స్థానిక ఎమ్మెల్యే పై అగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
రేక్క ఆడితేనే డొక్కాడని పరిస్థితి పరిస్థితి మాది అలాంటిది మా జీవన విధానంపై మున్సిపాలిటీ అధికారులు, స్థానిక ఎమ్మెల్యే తక్షణ ప్రత్యామ్నాయం చూపించకుండా డబ్బాలను తొలగించడం పై కన్నీరు చేస్తున్న చిరు వ్యాపారస్తులు, ప్రజా ప్రభుత్వమని చెప్పుకుంటూనే ఒక్కరోజు పర్యటన కోసం మా జీవితాలను రోడ్డుమీద పడేయడం సరికాదని ప్రభుత్వంపై మండిపడ్డారు. అదేవిధంగా ఏళ్ల తరబడి ఎల్లమ్మ గుడి నిర్మాణం చేసుకొని జీవనం కొనసాగిస్తున్న మహిళకు రాత్రి గుడిని తీసివేయాలని మునిసిపాలిటీ అధికారులు హెచ్చరించారు. హిందూ సాంప్రదాయ పద్ధతి ప్రకారం గుడిని తొలగించరాదని గుడిని తొలగిస్తే గందరగోళంగా ఉంటుందని కొందరు వ్యక్తులు ప్రభుత్వానికి హెచ్చరించారు. డబ్బాలు తొలగించిన వారి స్థలంలోనే మళ్లీ డబ్బాలను పునరుద్ధరించాలని లేనియెడల చిరు వ్యాపారస్తులకు రేవంత్ రెడ్డి,ఎమ్మెల్యే చిక్కుడు వంశీకృష్ణ నష్టపరిహార కింద ఒక్కొక్క కుటుంబానికి రెండు లక్షలు ఇవ్వాలని చిరు వ్యాపారస్తుల తరఫున డిమాండ్ చేశారు.




