Charakonda: జూపల్లి ఆలయానికి రూ.20 వేల విరాళం అందజేసిన గోలి శ్రీనివాస్
Charakonda: నాగర్‌కర్నూల్ జిల్లా చారకొండ మండలం జూపల్లి శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రతిష్ఠాపనకు ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.20 వేలు విరాళమిచ్చారు.
Charakonda: జూపల్లి ఆలయానికి రూ.20 వేల విరాళం అందజేసిన గోలి శ్రీనివాస్
చారకొండ: నాగర్ కర్నూల్ జిల్లా చారకొండ మండలంలోని జూపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో ఈ నెల 19న నిర్వహించనున్న విగ్రహ ప్రతిష్ఠాపన, ప్రత్యేక పూజా కార్యక్రమాల కోసం తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి రూ.20 వేల విరాళం అందజేశారు.
వెల్దండ మండల బీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎంపీపీ పుట్ట రామ్ రెడ్డి ద్వారా గ్రామ నాయకుడు బొజ్జయ్యకు ఈ విరాళాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ జంగిలి నిరంజన్, యువ నాయకులు అంజి మాస్టర్, పోలె అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.




