Charakonda: రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీను పరామర్శ
Charakonda: రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నెమల్లి గుట్ట తండాకు చెందిన శ్రీనును పరామర్శించిన వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు.
Charakonda: రోడ్డు ప్రమాదంలో గాయపడిన శ్రీను పరామర్శ
చారకొండ: నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జెపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని నెమల్లి గుట్ట తండాకు చెందిన కెలావత్ శ్రీను 9-08-2026 అనగా ఆదివారం రోజు జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఈ విషయం తెలుసుకున్న వెల్దండ సింగిల్ విండో చైర్మన్ జూపల్లి భాస్కర్ రావు ఆసుపత్రికి వెళ్లి కెలావత్ శ్రీను ను పరామర్శించారు. వైద్యులను కలిసి ఆయన ఆరోగ్య పరిస్థితి, అందుతున్న వైద్య చికిత్స వివరాలను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం శ్రీను కుటుంబ సభ్యులను కలిసి ధైర్యంగా ఉండాలని, అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. మెరుగైన వైద్యం అందేలా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని కుటుంబ సభ్యులకు హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో భాస్కర్ రావు యువసేన అధ్యక్షుడు ఎండి సిరాజ్ జేపల్లీ ఉప సర్పంచ్ మధు, ఎర్రవెల్లి మాజీ సర్పంచ్ సాయికుమార్, దోస్తీ ఫౌండేషన్ చైర్మన్ వంకేశ్వరం రమేష్, BRS పార్టీ నాయకులు జేపల్లీ ప్రశాంత్,మహేష్ నరేందర్,రాకేష్, చిరంజీవి BRS పార్టీ నేతలు కుటుంబ సభ్యులు మరియు తండావాసులు పాల్గొన్నారు




