Veldanda: వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ మట్ట యాదమ్మ

Veldanda: వెల్దండ మండలం కుప్పగండ్ల గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 15 Nov 2026 9:57 PM IST
Veldanda
X

Veldanda: వధూవరులను ఆశీర్వదించిన సర్పంచ్ మట్ట యాదమ్మ

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల పరిధిలోని కుప్పగండ్ల గ్రామానికి చెందిన కొమ్మగోని బాలరాజు గౌడ్ కుమారుడు గణేష్ వివాహ వేడుకలు ఆదివారం కేఎల్ఆర్ గార్డెన్స్‌లో ఘనంగా నిర్వహించారు.

ఈ వేడుకకు వెల్దండ గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. వారి దాంపత్య జీవితం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో సాగాలని ఆకాంక్షిస్తూ శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ శ్రీనివాస్ గౌడ్, నాయకులు మట్ట విష్ణు, ఎండీ రషీద్, సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, కొండల్, వెంకటేష్, రేవల్లి రాజు, ఈదులపల్లి శ్రీనివాస్, నాగరాజు, తిరుపతి, జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY