Nagar Kurnool: నాగర్ కర్నూల్ లో జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీల పోస్టర్ ఆవిష్కరణ!
Nagar Kurnool: నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్‌లో నవంబర్ 11న నిర్వహించే జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీల పోస్టర్‌ను కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆవిష్కరించారు.
Nagar Kurnool: నాగర్ కర్నూల్ లో జిల్లా స్థాయి యువజన సాంస్కృతిక పోటీల పోస్టర్ ఆవిష్కరణ!
Nagar Kurnool: యువజన సర్వీసు శాఖ, నాగర్ కర్నూల్ జిల్లా ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యువజనోత్సవాలు ఈ నెల 11న ప్రారంభమవుతాయని పోస్టర్ విడుదల చేసిన జిల్లా కలెక్టర్ శ్రీ హేమంత్ కేశవ్ పాటిల్ IAS., గారు, జిల్లా స్థాయి సాంస్కృతిక ఉత్సవాల క్రింద, అనేక అంశాలలో యువజనులకు పోటీలు నిర్వహించచున్నట్టు ఆయన వెల్లడించారు. నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించిన కళాకారులైన యువతి యువకులకు ఈ క్రింది అంశాలలో పోటీలలో పాల్గొన్నాల్సి ఉంటుందన్నారు.
ఇందులో ముఖ్యంగా జానపద నృత్యం – సమూహం ( Folk Dance Group), జానపద పాట – సమూహం (Folk Song Group), పేయింటింగ్(Painting), నుకడ్ నాటాక్ (Street Play) / Nukada Natak), కవిత రచన (Poetry Writing) నందు ప్రతీ అంశంలో విజేతలను నిర్ణయించి మొదటి స్థానం పొందిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేయటం జరుగుతుందన్నారు. ఈ పోటీలో పాల్గొనే యువ కళాకారులు నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన వారై ఉండాలన్నారు.
అలాగే, ఈ జిల్లా స్థాయి పోటీలు ప్రజావాణి మీటింగ్ హాల్, కలెక్టర్ కార్యాలయం, కొల్లాపూర్ చౌరస్తా దగ్గర, నాగర్ కర్నూల్ నందు ఉదయం 09.00 గం.ల నుండి జరుగుతాయన్నారు. పోటీలలో పాల్గొనే యువతీ యువకులు వయస్సు పోటీ నిర్వహించు నాటికి 15 సంవత్సరాల నుండి 29 సంవత్సరాలలోపు ఉండాలని, పోటీలో పాల్గొనే అంశానికి సంబంధించిన సామగ్రిని సంబంధిత యువ కళాకారులు తమ వెంట తెచ్చుకోవాలన్నారు.
జానపద నృత్యము బృందంలో 10 మంది సభ్యుల బృందం 5 నిమిషాల నుండి 10 నిమిషాల గరష్ట కాలపరిమితి మించకుండా ప్రదర్శించాల్సి ఉంటుందన్నారు. సిడీలను, పెన్ డ్రైవ్లు గాని అనుమతించబడవు. జానపద పాటల బృందం 10 మంది కంటే ఎక్కువ ఉండరాదన్నారు. రికార్డు చేయబడిన సిడీలను, పెన్ డ్రైవ్లు గాని అనుమతించబడవని కూడా ఆయన పేర్గొన్నారు.
ఈ కార్యక్రమములో శ్రీ బి. చెన్నయ్య, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), శ్రీ బి. దేవసహాయం, అదనపు కలెక్టర్ (ఎల్ .బి ), డి. చంద్రశేఖర్ కలెక్టరేట్ ఎ.ఓ., మరియు జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయ సిబ్బంది పాల్గోనారు. ఇతర పూర్తి వివరములకు సెల్ ఫోన్ నెం. 9493112095 మరియు 8341661832 లేదా నేరుగా జిల్లా యువజన మరియు క్రీడల కార్యాలయము, రూమ్ నెం.G1, ఐ.డి.ఓ.సి బిల్డీంగ్, కలెక్టర్ కార్యాలయం, కొల్లాపూర్ చౌరస్తా దగ్గర, నాగర్ కర్నూల్ నందు సంప్రదించగలరు.




