Achampet: మోదీ 25 ఏళ్ల ప్రస్థానం: అచ్చంపేటలో రక్తదాన శిబిరం!

Achampet:ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా అచ్చంపేటలో బీజేవైఎం ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 13 Oct 2026 7:51 PM IST
Achampet
X

Achampet: మోదీ 25 ఏళ్ల ప్రస్థానం: అచ్చంపేటలో రక్తదాన శిబిరం!

అచంపేట్: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రజా జీవితంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, BJYM (భారతీయ జనతా యువమోర్చా) ఆధ్వర్యంలో అచ్చంపేట పట్టణంలోనీ bk ప్యాలెస్ లో రక్తదాన శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం BJYM జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేష్ వర్మ ఆధ్వర్యంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా BJYM జిల్లా అధ్యక్షులు దన్నోజు నరేష్ చారి , సేవా సంకల్ప్ అభియాన్ జిల్లా కో-కన్వీనర్ బల్మూరి జానకి హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు రేణయ్య గారు, బాలాజీ , బీజేపీ జిల్లా కార్యదర్శి వరికుప్పల ఆంజనేయులు , జిల్లా సోషల్ మీడియా ఇన్‌చార్జి అఖిల్ రెడ్డి , దళిత మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి శంకర్ మాదిగ , BJYM జిల్లా ఉపాధ్యక్షులు రాకాసి దేవేందర్ రెడ్డి , BJYM జిల్లా మీడియా కన్వీనర్ ఉదయ్ గౌడ్ , ST మోర్చా జిల్లా అధ్యక్షులు రవీందర్ చౌహన్ , బీజేపీ పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్. పట్టణ ప్రధాన కార్యదర్శి రంగినేని రవీందర్. బీజేపీ SC మోర్చా అచ్చంపేట మండల అధ్యక్షులు గాలిముడి రాము గారు, తదితర నాయకులు పాల్గొన్నారు.

రక్తదానం ప్రాణదానం!

రక్తదానం ద్వారా ఆపదలో ఉన్న వారి ప్రాణాలను కాపాడవచ్చనే సందేశాన్ని చాటిచెబుతూ ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరిగింది. సమాజ సేవలో యువత భాగస్వామ్యం కావాలనే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమం ద్వారా రక్తదాన ఆవశ్యకతపై అవగాహన కల్పించడం జరిగింది.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA