Achampet: ఈనెల 26న అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి.. భారీ ఏర్పాట్లు!

Achampet: ఈనెల 26న సీఎం రేవంత్ రెడ్డి అచ్చంపేటకు రానున్న నేపథ్యంలో వై జంక్షన్ బహిరంగ సభా స్థలిని, ఏర్పాట్లను ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ అధికారులతో కలిసి పరిశీలించారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA
Published on: 20 Nov 2026 12:46 PM IST
Achampet
X

Achampet: ఈనెల 26న అచ్చంపేటకు సీఎం రేవంత్ రెడ్డి.. భారీ ఏర్పాట్లు!

అచ్చంపేట: ఈనెల 26వ తేదీన అచ్చంపేటకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు విచ్చేయనున్న నేపథ్యంలో అచ్చంపేట నియోజకవర్గంలో భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. అచ్చంపేట వై జంక్షన్ వద్ద నిర్వహించనున్న భారీ బహిరంగ సభ వేదిక, సభా స్థలిని TPCC ఉపాధ్యక్షులు, DCC అధ్యక్షులు & అచ్చంపేట MLA డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ గారు బుధవారం క్షుణ్ణంగా పరిశీలించారు.

సభా స్థలిలో ఏర్పాట్లు ఎలా..?

ఉదయం నుండి సభా స్థలానికి చేరుకున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ, అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి సభా ప్రాంగణం మొత్తం కలియదిరిగారు. వేదిక ఎక్కడ ఏర్పాటు చేయాలి, సీఎం హెలికాప్టర్ దిగే ప్రాంతం, సీఎం వాహనం వచ్చే మార్గం, ప్రజలు కూర్చునే ప్రాంతం ఎంత వరకు ఉండాలి, మహిళలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలు, మీడియా గ్యాలరీ, వీఐపీలకు ప్రత్యేక గ్యాలరీ వంటి అంశాలపై అధికారులతో చర్చించారు.

ట్రాఫిక్, పార్కింగ్, భద్రతపై ప్రత్యేక దృష్టి..

సభకు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుండి వేలాది మంది ప్రజలు, కార్యకర్తలు తరలివచ్చే అవకాశం ఉండటంతో ట్రాఫిక్, పార్కింగ్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఎమ్మెల్యే అధికారులను ఆదేశించారు. వాహనాల పార్కింగ్ కోసం ప్రత్యేక స్థలాలను గుర్తించాలని, అంబులెన్స్, అగ్నిమాపక వాహనాలు, పోలీసు వాహనాలకు ప్రత్యేక మార్గం ఉండాలని సూచించారు.

తాగునీరు, తాత్కాలిక మరుగుదొడ్లు, విద్యుత్ సరఫరా, సౌండ్ సిస్టం, బారికేడింగ్, సీసీ కెమెరాలు, భద్రతా ఏర్పాట్లపై పోలీసు, రెవెన్యూ, మున్సిపల్, విద్యుత్ శాఖ అధికారులతో సమీక్షించారు.

సీఎం పర్యటన విజయవంతం చేయాలి..

సీఎం పర్యటన అచ్చంపేట నియోజకవర్గానికి ఎంతో ప్రతిష్టాత్మకమని, సభను చారిత్రాత్మకంగా విజయవంతం చేయాలని ఎమ్మెల్యే వంశీకృష్ణ పిలుపునిచ్చారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి, ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆదేశించారు. కార్యకర్తలు, నాయకులు గ్రామగ్రామాన తిరిగి ప్రజలను సభకు తరలించాలని కోరారు.

ఈ పరిశీలన కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

V. RAVINDR GOUD, ACCHAMPETA

V. RAVINDR GOUD, ACCHAMPETA