Achampet: నల్లమల పుణ్యక్షేత్రాల్లో దారెడ్డి సందీప్ రెడ్డి పూజలు!
Achampet: అచ్చంపేట టీఆర్ఎస్ ఇన్చార్జి దారెడ్డి సందీప్ రెడ్డి నల్లమల క్షేత్రాలైన ఉమామహేశ్వరం, మద్దిమడుగు ఆలయాల్లో కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Achampet: నల్లమల పుణ్యక్షేత్రాల్లో దారెడ్డి సందీప్ రెడ్డి పూజలు!
అచ్చంపేట: అచ్చంపేట నియోజకవర్గ తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీ ఇన్చార్జిగా నియమితులైన దారెడ్డి సందీప్ రెడ్డి తన నూతన బాధ్యతల ప్రస్థానాన్ని ఆధ్యాత్మికంగా ప్రారంభించారు. బాధ్యతలు స్వీకరించిన మరుసటి రోజే సోమవారం నల్లమల అటవీ ప్రాంతంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలను కుటుంబ సమేతంగా సందర్శించారు.
తొలుత నాగర్ కర్నూల్ జిల్లాలోని అత్యంత ప్రాచీన శైవ క్షేత్రమైన ఉమామహేశ్వర ఆలయాన్ని దర్శించుకున్నారు. అక్కడ స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం అక్కడి నుండి నల్లమల అడవుల్లో వెలసిన మరో మహిమాన్విత క్షేత్రమైన మద్దిమడుగు పబ్బతి ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకున్నారు. అక్కడ ఆంజనేయస్వామికి ప్రత్యేక పూజలు చేసి, ఆలయ ప్రాంగణంలో కొద్దిసేపు గడిపారు.
ఈ సందర్భంగా దారెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ... "ఉమామహేశ్వరుడు, ఆంజనేయస్వామి ఆశీస్సులతో అచ్చంపేట నియోజకవర్గ ప్రజలకు నిస్వార్థంగా సేవ చేసే శక్తిని ఇవ్వాలని కోరుకున్నాను. నాపై నమ్మకంతో టీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి బాధ్యతలు అప్పగించింది. ఆ నమ్మకాన్ని నిలబెడుతూ నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేస్తూ, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానుఅని తెలిపారు. ఆయన వెంట కుటుంబ సభ్యులు, పార్టీ ముఖ్య నాయకులు, అభిమానులు పాల్గొన్నారు.




