Veldanda: యూత్ కాంగ్రెస్ తీరుపై బీజేవైఎం నిరసన
Veldanda: బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద యువజన కాంగ్రెస్ నాయకుల నిరసనలు, దిష్టిబొమ్మ దగ్ధం ఘటనపై వెల్దండ మండల బీజేవైఎం అధ్యక్షులు అరుణ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Veldanda: యూత్ కాంగ్రెస్ తీరుపై బీజేవైఎం నిరసన
వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండలం రాష్ట్ర రాజధానిలో బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద యువజన కాంగ్రెస్ నాయకులు వ్యవహరించిన తీరు సరైనది కాదని బీజేవైఎం మండల అధ్యక్షులు బాణావత్ అరుణ్ నాయక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అరుణ్ నాయక్ మాట్లాడుతూ బిజెపి పార్టీ కార్యాలయం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి కార్యాలయం గేటుకు నల్ల రంగు లు వేయడం యువజన కాంగ్రెస్ పార్టీ నాయకుల అవివేకమని దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి పరుస్తున్న ప్రధాని మోడీపైనే విమర్శలు చేయడం సరైన పద్ధతి కాదని ఈ ల వ్యవహరిస్తే యువజన కాంగ్రెస్ నాయకులకు తాగిన బుద్ధి చెప్తామని అన్నారు.
Next Story




