Nagarkurnool: వంగూరులో మృతి చెందిన గెల్వయ్య కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నాయకులు

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో అనారోగ్యంతో మృతి చెందిన సల్వాది గెల్వయ్య కుటుంబాన్ని బీఆర్‌ఎస్ నాయకులు పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 30 Sept 2026 4:15 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: వంగూరులో మృతి చెందిన గెల్వయ్య కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్‌ఎస్ నాయకులు

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని వంగూరు మండల కేంద్రానికి చెందిన సల్వాది గెల్వయ్య (70) అనారోగ్యంతో మంగళవారం మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు వేనేపల్లి గణేష్‌రావు, మాజీ సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లాగౌడ్, గ్రామ ఉపసర్పంచ్ బండపల్లి భాస్కర్ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

మృతుని కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సానుభూతి తెలియజేసి, గెల్వయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. అనంతరం కుటుంబానికి రూ.10,000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు. కుటుంబానికి అండగా ఉంటామని వారు భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షులు బండపల్లి జంగయ్య, వార్డు సభ్యులు సుమన్, అక్కి మురళీ, నారమోని జంగయ్య, బండపల్లి శివకుమార్, లట్టుపల్లి మురళి, సోషల్ మీడియా ఇన్‌చార్జ్ ఎల్లికంటి మురళి, బాషమోని కృష్ణ, అయినాల రమేష్, జంపుల మధు, లక్ష్మణ్, రమేష్, బండపల్లి శ్రీశైలం, బుచ్చిరాములు, భాషమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY