Nagarkurnool: బోనాల వేడుకల్లో కోడిని కొరికి చంపిన ఘటన.. కేసు నమోదు!

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో బోనాల వేడుకల్లో కోడిని కొరికి చంపిన ఘటనపై ఇన్‌స్టాగ్రామ్ వీడియో ఆధారంగా ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 28 Aug 2026 8:34 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: బోనాల వేడుకల్లో కోడిని కొరికి చంపిన ఘటన.. కేసు నమోదు!

Nagarkurnool: బోనాల పండుగ సందర్భంగా నాగర్‌కర్నూల్ పట్టణంలోని ఈదమ్మ గుడి సమీపంలో నిర్వహించిన డాన్స్‌ కార్యక్రమంలో కోడిని కొరికి చంపిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ కావడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

సోషల్ మీడియాలో వచ్చిన రీల్స్‌ను పరిశీలించిన యానిమల్ హస్బెండరీ ఎన్‌జీవో ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు కార్యక్రమ నిర్వాహకుడు తిమ్మాజిపేట పాండు, డాన్స్‌ గ్రూప్‌ ఇన్‌చార్జి రేలారే మనోజ్, కోడితో డాన్స్‌ చేసి దానిని కొరికి చంపిన దుర్గా ప్రసాద్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

జంతువుల పట్ల క్రూరత్వానికి పాల్పడిన ఘటనగా భావిస్తూ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఘటనకు సంబంధించిన వీడియోలు, ఇతర ఆధారాలను పరిశీలిస్తున్నట్లు ఎస్‌ఐ వెంకట్ రెడ్డి తెలిపారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

Next Story