Kalwakurthy: కల్వకుర్తిలో కలెక్టర్ హేమంత్ కేశవ్ ఆకస్మిక తనిఖీలు

Kalwakurthy: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలో సాగుతున్న పలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 11 Jun 2026 3:17 PM IST
Kalwakurthy
X

Kalwakurthy: కల్వకుర్తిలో కలెక్టర్ హేమంత్ కేశవ్ ఆకస్మిక తనిఖీలు

Kalwakurthy: నాగర్ కర్నూల్ జిల్లా, కల్వకుర్తి లోని మున్సిపల్ పరిధిలో కొనసాగుతున్న పలు అభివృద్ధి పనులు, సంక్షేమ కార్యక్రమాలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ తనిఖీ చేశారు.

జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు, నాణ్యమైన సంక్షేమ సేవలు అందించడంలో ఎలాంటి రాజీ పడకూడదని అధికారులను ఆదేశించారు. ముందుగా ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్మించిన షాపింగ్ కాంప్లెక్స్‌ను పరిశీలించి దుకాణాల కేటాయింపు, వినియోగ పరిస్థితులపై వివరాలు తెలుసుకున్నారు. ఖాళీగా ఉన్న దుకాణాలను అర్హులైన లబ్ధిదారులకు త్వరితగతిన కేటాయించాలని సూచించారు.

అనంతరం నిర్మాణంలో ఉన్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను పరిశీలించారు. ఆసుపత్రి నిర్మాణం పూర్తైతే కల్వకుర్తి నియోజకవర్గ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.వ్యవసాయ మార్కెట్‌ను సందర్శించి అక్కడి సదుపాయాలను పరిశీలించారు. రైతులు, వ్యాపారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అవసరమైన మౌలిక వసతులు కల్పించాలని సూచించారు.

మార్కెట్‌లో పరిశుభ్రత, తాగునీరు, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY

Next Story