Nagarkurnool: నాగర్‌కర్నూల్ ప్రజావాణికి 57 వినతులు: కలెక్టర్ హేమంత!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ కలెక్టరేట్ ప్రజావాణిలో 57 వినతులు అందాయి. అర్జీలను పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ఆదేశించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 2 Nov 2026 9:27 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: నాగర్‌కర్నూల్ ప్రజావాణికి 57 వినతులు: కలెక్టర్ హేమంత!

నాగర్‌కర్నూల్: ప్రజావాణి కార్యక్రమంలో ప్రజల నుంచి అందిన అర్జీలను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, నిబంధనల ప్రకారం పరిష్కరించేందుకు సత్వర చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ అధికారులను ఆదేశించారు.

సోమవారం నాగర్‌కర్నూల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోరుతూ మొత్తం 57 దరఖాస్తులు, వినతిపత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ చెన్నయ్య, జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్ఓ) పాండు, కలెక్టరేట్ పరిపాలనాధికారి (ఏఓ) చంద్రశేఖర్‌లతో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు.

ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటీల్ మాట్లాడుతూ ప్రజలు సమర్పించిన ప్రతి దరఖాస్తును సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, సమస్య స్వభావాన్ని బట్టి నిర్ణీత నిబంధనల మేరకు పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. అర్జీల పరిష్కారంలో జాప్యం లేకుండా చూడాలని, ప్రజలకు సకాలంలో తగిన పరిష్కారం అందించేలా అధికారులు బాధ్యతతో వ్యవహరించాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, కలెక్టరేట్ విభాగాల సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL