Nagarkurnool: మరిదితో వివాహేతర సంబంధం: భర్తను చంపించిన భార్య అరెస్ట్!

Nagarkurnool: నాగర్‌కర్నూల్‌లో సంచలనం సృష్టించిన కరీం హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో భార్య, మరిది కలిసి హత్య చేసినట్లు వెల్లడించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 13 Sept 2026 5:51 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: మరిదితో వివాహేతర సంబంధం: భర్తను చంపించిన భార్య అరెస్ట్!

నాగర్ కర్నూల్: రెండు రోజుల క్రితం జిల్లా కేంద్రంలో సంచలనం సృష్టించిన కరీం హత్య కేసులో ఇద్దరు నిందితులను గుర్తించినట్లు నాగర్ కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. కరీం భార్య సలీమా బేగం, గౌస్ పాషాలను నిందితులుగా గుర్తించినట్లు వెల్లడించారు. గౌస్ పాషా మృతుడు కరీంకు వరుసకు తమ్ముడని, గతంలో కరీం నిర్వహించే హోటల్‌లో పనిచేసేవాడని తెలిపారు.

సలీమా బేగం, గౌస్ పాషా మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. ఈ విషయమై కరీం, సలీమా బేగం మధ్య తరచూ గొడవలు జరిగేవని, పలుమార్లు పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీలు కూడా జరిగినట్లు తెలిపారు. దీంతో కరీంను హత్య చేయాలని సలీమా బేగం, గౌస్ పాషా కలిసి కుట్ర పన్నినట్లు డీఎస్పీ పేర్కొన్నారు.

నెల్లూరు దర్గాకు వెళ్లిన అనంతరం కరీంను హత్య చేయాలని సలీమా బేగం గౌస్ పాషాకు ఈ నెల 9న వాట్సప్ కాల్ ద్వారా చెప్పినట్లు పోలీసులు తెలిపారు. అనంతరం 10వ తేదీ అర్ధరాత్రి గౌస్ పాషా కరీం ఇంటికి వెళ్లి కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి హత్య చేసినట్లు వెల్లడించారు. కేసుకు త్వరితగతిన చేదించినందుకు సీఐ అశోక్ రెడ్డి, ఎస్ఐ వెంకట్ రెడ్డి క్రైమ్ పార్టీ పోలీసులు భీముడు, వెంకటేష్, రమేష్ లను డీఎస్పీ బుర్రీ శ్రీనివాస్ అభినందించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL