Nagarkurnool: గారడీ మాటలు బంద్ చెయ్.. హామీలపై శ్వేతపత్రం విడదల చెయ్
Nagarkurnool: నిరుద్యోగులు, విద్యార్థులకు ఇచ్చిన హామీలపై కాంగ్రెస్ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని బీఆర్ఎస్ యువనేత డాక్టర్ నాగం శశిధర్ రెడ్డి డిమాండ్ చేశారు.
Nagarkurnool: గారడీ మాటలు బంద్ చెయ్.. హామీలపై శ్వేతపత్రం విడదల చెయ్
నాగర్ కర్నూల్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గారడి మాటలు మానుకొని ఎన్నికల ముందు వివిధ సభలలో విద్యార్థులకు యువకులకు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలను ఎన్ని అమలు చేశారో శ్వేత పత్రం విడుదల చేయాలని బి ఆర్ ఎస్ యువనేత డిమాండ్ చేశారు గురువారం జిల్లా కేంద్రంలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వెంటనే రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు అవుతున్న నోటిఫికేషన్ల ద్వారా ప్రభుత్వం సుమారు 14 వేల ఉద్యోగాలు మాత్రమే భర్తీ చేశారని తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలలో విద్యార్థిని లకు ఇచ్చిన స్కూటీల హామీ ఎక్కడ పోయిందని నిరుద్యోగ భృతి తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు చెల్లిస్తామన్న నెలకు 20 వేల పథకం ఏమైందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ అధికారంలోకి వచ్చిన ప్రజా సమస్యలను నిర్లక్ష్యం చేయడం వల్ల రాష్ట్రంలో కరువు కష్టాలు ఏర్పడతాయని వివరించారు.
రైతులకు వ్యవసాయానికి 26% భూములకు కూడా నీరు అందడం లేదని ఆంధ్రప్రదేశ్లో 80% వ్యవసాయ పొలాలకు నీరు అందిస్తున్నారని తెలిపారు. విద్యుత్ కొరతను పరిష్కరించలేకపోతున్నారని అన్నారు. తమ సొంత భూముల విలువలను పెంచుకునేందుకే ఎమ్మెల్యే ఎమ్మెల్సీ తూడుకుర్తి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ పాఠశాల నిర్మాణం చేపడుతున్నారని ప్రజలకు అందుబాటులో ఉండే స్థలంలో నిర్మాణం చేయాలి కానీ వారు అలా చేయడం లేదన్నారు.
పెండింగ్ లో ఉన్న నియామకాలను చేపట్టి వైయస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రవేశపెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను కూడా ప్రభుత్వం చెల్లించడం లేదని ఆరోగ్య శ్రీ పథకం నిర్లక్ష్యం చేస్తున్నారని విరుచుకుపడ్డారు ఈ సమావేశంలో పార్టీ సీనియర్ నాయకులు అర్థం రవి బాలగౌడ్ లక్ష్మయ్య కౌన్సిలర్ అర్జునయ్య నాయకులు భీముడు సత్యం సుబ్బయ్య వెంకటేశ్వర్లు భీమయ్య రాజు తదితరులు పాల్గొన్నారు.




