Nagarkurnool: తిమ్మాజిపేట ఎస్ఐపై ఆరోపణలు పూర్తిగా అవాస్తవం

Nagarkurnool: తిమ్మాజిపేట ఎస్ఐపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారంలో ఎలాంటి నిజం లేదని నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 27 Aug 2026 8:08 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: తిమ్మాజిపేట ఎస్ఐపై ఆరోపణలు పూర్తిగా అవాస్తవం

నాగర్‌కర్నూల్: తిమ్మాజిపేట ఎస్ఐపై ఇటీవల సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని నాగర్‌కర్నూల్ డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఎస్ఐ ఎలాంటి తప్పు చేయలేదని తెలిపారు. తిమ్మాజిపేట ఘటనపై విచారణ చేపట్టిన సీఐ అశోక్‌రెడ్డితో కలిసి డీఎస్పీ మీడియాతో మాట్లాడి వివరాలను వెల్లడించారు.

ఎస్ఐ ఓ వ్యక్తిపై మూత్ర విసర్జన చేశారంటూ జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని డీఎస్పీ కొట్టిపారేశారు. విచారణ అధికారి సీఐ అశోక్‌రెడ్డి మాట్లాడుతూ ఈ ఆరోపణలకు సంబంధించి ఎలాంటి మెడికల్ ఆధారాలు లేవని, అలాగే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని తెలిపారు. కొందరు కావాలనే తప్పుడు ఆరోపణలు చేస్తూ ప్రచారం చేస్తున్నారని అధికారులు పేర్కొన్నారు.

యూట్యూబ్ ఛానెళ్లకు డీఎస్పీ హెచ్చరిక

వాస్తవాలను నిర్ధారించుకోకుండా తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దని డీఎస్పీ బుర్రి శ్రీనివాస్ యూట్యూబ్ ఛానెళ్లను హెచ్చరించారు. అసత్యాలు, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే సంబంధిత ఛానెళ్లపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. మీడియా సంస్థలు ఏదైనా వార్తను ప్రచురించే ముందు వాస్తవాలను నిర్ధారించుకోవాలని సూచించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

Next Story