Nagarkurnool: ఘనంగా ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి రిటైర్మెంట్ వేడుక

Nagarkurnool: నాగర్‌కర్నూల్ స్టేషన్ ఫైర్ ఆఫీసర్ ఐ. కృష్ణమూర్తి 42 ఏళ్ల సేవలకు గాను ఘనంగా రిటైర్మెంట్ సన్మానం నిర్వహించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 31 Aug 2026 10:45 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ఘనంగా ఫైర్ ఆఫీసర్ కృష్ణమూర్తి రిటైర్మెంట్ వేడుక

నాగర్‌కర్నూల్: స్టేషన్ ఫైర్ ఆఫీసర్‌గా శ్రీ I. కృష్ణమూర్తి తెలంగాణ రాష్ట్ర ఫైర్ సర్వీసెస్‌లో 42 సంవత్సరాల పాటు అందించిన విశిష్టమైన, అంకితభావ సేవలకు గుర్తుగా నిర్వహించిన రిటైర్మెంట్ కార్యక్రమానికి నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేంద్ర కుమార్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కృష్ణమూర్తి ని ఘనంగా సన్మానించి, ప్రజల ప్రాణాలు మరియు ఆస్తుల రక్షణ కోసం ఆయన అందించిన సేవలను మున్సిపల్ చైర్మన్ కొనియాడారు. రిటైర్మెంట్ అనంతరం ఆయన ఆయురారోగ్యాలతో, కుటుంబ సభ్యులతో సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్ 7వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జీ హర్షవర్ధన్ రెడ్డి , ఫైర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

Next Story