Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో పంచాయతీ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చేర్కూర్ గ్రామంలో పంచాయతీ కార్మికులకు ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు పంపిణీ చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 30 Sept 2026 4:27 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లాలో పంచాయతీ కార్మికులకు ఉచిత వైద్య శిబిరం

నాగర్కర్నూల్: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో బుధవారం చేర్కూర్ గ్రామంలో గ్రామపంచాయతీ వర్కర్లకు ప్రత్యేక ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించారు, ఈ కార్యక్రమంలో పాల్గొన్న గ్రామ సర్పంచ్ బచ్చలకూర శ్రీనివాసులు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ గ్రామాన్ని నిరంతరం పరిశుభ్రంగా ఉంచుతూ ప్రజా ఆరోగ్యం కోసం శ్రమిస్తున్న పంచాయతీ కార్మికుల ఆరోగ్యం చాలా ముఖ్యమైనదని పేర్కొన్నారు,ప్రతీ వర్కర్ తమ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఇటువంటి హెల్త్ క్యాంపులను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

​అనంతరం వెల్దండ వైద్య బృందం గ్రామపంచాయతీ సిబ్బందికి బిపి (రక్తపోటు), షుగర్ తదితర ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, అవసరమైన వారికి ఉచితంగా మందులను అందజేశారు,ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ కొండలు,వార్డు మెంబర్లు పురుగుల లాలయ్య, పురుగుల రమేష్,గొర్రె జంగయ్య,కేశమోని జంగయ్య, పి హెచ్ సి వైద్య బృందం, ఆశ వర్కర్లు, గ్రామపంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY