Nagarkurnool: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత!
Nagarkurnool: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో మృతి చెందిన పరశురాముల చారి కుటుంబాన్ని పరామర్శించి రూ. 5,000 ఆర్థిక సహాయం అందజేశారు.
Nagarkurnool: మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత!
Nagarkurnool: కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామానికి చెందిన కాశమౌని పరశురాముల చారి ఆకస్మికంగా మృతి చెందారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి స్పందించి ఆదివారం మృతుని కుటుంబానికి రూ.5,000 ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి వారికి అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ సింగం విజయ్ గౌడ్, సర్పంచ్ జల్లెల్ల పద్మ కృష్ణ యాదవ్, ఉప సర్పంచ్ మున్య నాయక్, బైరాపురం తిరుపతయ్య, వార్డు సభ్యులు యముకంటి వెంకటేష్, శెట్టిపల్లి లోకేష్, నీరటి శేఖర్, పాలారీ పర్వతాలు, ఆరకంటి, ఎముకంటి శ్రీశైలం, జల్లెల్ల మొగులాల్, బొడ్డుపల్లి సురేష్ తదితర ముఖ్య నాయకులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.




