Nagarkurnool: ప్రజారోగ్య పరిరక్షణకు ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛ జలధార!
Nagarkurnool: ప్రజలకు సురక్షిత తాగునీరు అందించే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెల్దండ మండలం లింగారెడ్డిపల్లిలో 'స్వచ్ఛ జలధార' కార్యక్రమం నిర్వహించారు.
Nagarkurnool: ప్రజారోగ్య పరిరక్షణకు ఐక్యత ఫౌండేషన్ స్వచ్ఛ జలధార!
Nagarkurnool: ప్రజలకు పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే లక్ష్యంతో ఐక్యత ఫౌండేషన్ చైర్మన్ సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి సహకారంతో చేపట్టిన “స్వచ్ఛ జలధార” కార్యక్రమం రెండవ విడతలో భాగంగా గురువారం వెల్దండ మండలం లింగారెడ్డి పల్లి గ్రామంలో రెండు (2) త్రాగునీటి నిల్వ ట్యాంకులను పరిశుభ్రపరిచారు..
జర్మన్ సాంకేతికతతో కూడిన ప్రత్యేక యంత్రాల సహాయంతో ట్యాంకుల్లో పేరుకుపోయిన మురికి, వ్యర్థాలను శాస్త్రీయ పద్ధతిలో తొలగించి ట్యాంకులను పరిశుభ్రంగా మార్చారు.
ప్రజల ఆరోగ్య పరిరక్షణతో పాటు త్రాగునీటి నాణ్యతను మెరుగుపరచాలనే ఉద్దేశంతో “స్వచ్ఛ జలధార” కార్యక్రమాన్ని కల్వకుర్తి నియోజకవర్గంలోని గ్రామాల్లో దశలవారీగా కొనసాగించనున్నారు.
గ్రామస్తులు మాట్లాడుతూ.. ప్రజల ఆరోగ్యం, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి చేపడుతున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని తెలిపారు. ముఖ్యంగా పరిశుభ్రమైన త్రాగునీరు అందించాలనే ఉద్దేశంతో “స్వచ్ఛ జలధార” కార్యక్రమం ద్వారా గ్రామాల్లోని నీటి నిల్వ ట్యాంకులను శాస్త్రీయ పద్ధతిలో పరిశుభ్రపరచడం ఎంతో ఉపయోగకరమైన కార్యక్రమమని పేర్కొన్నారు..
గ్రామీణ ప్రాంతాల ప్రజల అవసరాలను గుర్తించి నిరంతరం సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సుంకిరెడ్డి రాఘవేందర్ రెడ్డి గారికి గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో..
లింగారెడ్డి పల్లి గ్రామ సర్పంచ్ అన్వర్ పాష గ్రామ కార్యదర్శి సురేందర్ రెడ్డి డిప్యూటీ సర్పంచ్ ఐక్యత ఫౌండేషన్ ప్రతినిధులు వార్డు సభ్యులు, యువకులు, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
పరిశుభ్రమైన త్రాగునీరు... ఆరోగ్యవంతమైన సమాజానికి పునాది.




