Veldanda: బీరువా పగులగొట్టి నగదు, మొబైల్ ఫోన్ అపహరించిన దుండగులు!
Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలో గుర్తుతెలియని దొంగలు ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి నగదు, మొబైల్ ఫోన్ అపహరించారు. ఎస్సై యుగంధర్ రెడ్డి కేసు నమోదు చేశారు.
Veldanda: బీరువా పగులగొట్టి నగదు, మొబైల్ ఫోన్ అపహరించిన దుండగులు!
వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండల కేంద్రంలో గుర్తుతెలియని దొంగలు ఒకే రాత్రి మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడిన ఘటన చోటుచేసుకుంది. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై యుగంధర్ రెడ్డి కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. వివరాల్లోకి వెళితే.. వెల్దండ గ్రామానికి చెందిన దార రాములు తన భార్యతో కలిసి ఆదివారం సాయంత్రం సుమారు 6 గంటల సమయంలో తాండ్ర గ్రామంలో నివసిస్తున్న తన కుమార్తె ఇంట్లో జరిగిన శుభకార్యానికి వెళ్లారు.
ఈ క్రమంలో ఇంటికి తాళం వేసి వెళ్లిన దంపతులు సోమవారం ఉదయం 7 గంటల సమయంలో తిరిగి వచ్చారు. ఇంటికి వేసిన తాళం పడి ఉండటంతో అనుమానం వచ్చిన వారు లోపలికి వెళ్లి పరిశీలించగా, బెడ్‌రూమ్‌లోని బీరువాను గుర్తుతెలియని వ్యక్తులు బలవంతంగా తెరిచి, అందులోని వస్తువులు, దుస్తులను చిందరవందరగా పడేసినట్లు గుర్తించారు.
బీరువాలో ఉంచిన రూ.9 వేల నగదు కనిపించకపోవడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకున్నారు. అదేవిధంగా సమీపంలో నివసించే వెంకటయ్య ఇంట్లో ఒక మొబైల్ ఫోన్, అలివేలు అనే మహిళ ఇంట్లో రూ.1,500 నగదును కూడా గుర్తుతెలియని వ్యక్తులు అపహరించినట్లు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వెల్దండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వరుస చోరీలతో గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు క్లూస్ టీం తెప్పించి వివరాలు సేకరించారు.




