Maddimadugu: మద్దిమడుగు ఆంజనేయస్వామి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు!
Maddimadugu: నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగు పుణ్యక్షేత్రంలోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి మంత్రులు, ప్రజాప్రతినిధులతో కలిసి దర్శించుకున్నారు.
Maddimadugu: మద్దిమడుగు ఆంజనేయస్వామి సన్నిధిలో సీఎం రేవంత్ రెడ్డి పూజలు!
మద్దిమడుగు: నాగర్ కర్నూల్ జిల్లా మద్దిమడుగు పుణ్యక్షేత్రంలోని ప్రసిద్ధ శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ. రేవంత్ రెడ్డి సందర్శించారు. రాష్ట్ర మంత్రులు దామోదర్ రాజనర్సింహ, జూపల్లి కృష్ణారావు, వాకాటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎంపీ డాక్టర్ మల్లు రవి, అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ లతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు, అర్చకులు ముఖ్యమంత్రికి ఆలయ సంప్రదాయాల ప్రకారం పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం ముఖ్యమంత్రి ముందుగా ఆలయ ప్రాంగణంలోని శ్రీ వినాయక స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తదుపరి గర్భాలయంలో కొలువుదీరిన మూలవిరాట్ శ్రీ ఆంజనేయస్వామివారిని దర్శించుకుని భక్తిపూర్వకంగా నమస్కరించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేద పండితులు ముఖ్యమంత్రి పేరిట ప్రత్యేక పూజలు నిర్వహించి, వేదమంత్రోచ్ఛారణల నడుమ వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందించి ఆశీర్వదించారు. మద్దిమడుగు పుణ్యక్షేత్రంలో ఆధ్యాత్మిక వాతావరణం మధ్య సాగిన ఈ దర్శన కార్యక్రమంలో ముఖ్యమంత్రి స్వామివారి ఆశీస్సులు పొందారు.




