Nagarkurnool: రామాలయంలో వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో రాఖీ పౌర్ణమి సందర్భంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు అత్యంత వైభవంగా నిర్వహించారు.
Nagarkurnool: రామాలయంలో వైభవంగా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
నాగర్‌కర్నూల్: శ్రావణ మాసం రాఖీ పౌర్ణమి సందర్భంగా నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని రామ్‌నగర్ కాలనీలో ఉన్న శ్రీ సీతారామచంద్రస్వామి దేవాలయంలో శుక్రవారం సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు వైభవంగా నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు కందాడై వరదరాజన్ అయ్యంగార్ ఆధ్వర్యంలో 12 జంటలు వ్రతాల్లో పాల్గొన్నారు.
పౌర్ణమి రోజున విష్ణు స్వరూపమైన సీతారామచంద్రస్వామి వారి సన్నిధిలో సత్యనారాయణ స్వామి వ్రతం నిర్వహించడం ఆధ్యాత్మికంగా ఎంతో విశిష్టమైనదని కందాడై వరదరాజన్ అయ్యంగార్ తెలిపారు. వ్రతాల అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా ఆలయంలో సామూహికంగా ఉచితంగా సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు 450 మంది భక్తులు పాల్గొన్నారు. రామాలయ అన్నప్రసాద కమిటీ ఆధ్వర్యంలో భక్తులందరికీ అన్నప్రసాదం పంపిణీ చేశారు. రామాలయ భజన మండలి, నిత్య విష్ణు సహస్ర పారాయణ కమిటీ సభ్యులు ప్రత్యేక భజనలు నిర్వహించారు. కార్యక్రమంలో కందాడై శ్రీనివాసచార్యులు, కరుణశ్రీ, అర్థం రవీందర్, మల్లేష్, గొల్ల రాములు, రమాదేవి, శారదతో పాటు అధిక సంఖ్యలో మహిళా భక్తులు పాల్గొన్నారు.




