Nagarkurnool: మినీ ట్యాంక్ బండ్పై దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
Nagarkurnool: నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్పై దసరా ఏర్పాట్లు, పారిశుద్ధ్యాన్ని ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించి అధికారులకు ఆదేశాలిచ్చారు.
Nagarkurnool: మినీ ట్యాంక్ బండ్పై దసరా ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే
నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ మినీ ట్యాంక్ బండ్పై దసరా పండుగ సందర్భంగా చేపట్టిన శుభ్రత, పారిశుద్ధ్య ఏర్పాట్లను ఎమ్మెల్యే కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి పరిశీలించారు. దసరా పండుగకు ట్యాంక్ బండ్కు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అవసరమైన అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని అధికారులకు సూచించారు.
ట్యాంక్ బండ్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. పండుగకు వచ్చే ప్రజలకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించేలా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ సునెంద్ర, వైస్ చైర్మన్ బాదం రమేష్, పట్టణ అధ్యక్షుడు జక్కా రాజు, కౌన్సిలర్లు, తదితరులు పాల్గొన్నారు.




