Veltoor: వెల్టూర్ గ్రామంలో కోతుల బీభత్సం: వృద్ధురాలిపై దాడి, గాయాలు!
Veltoor: ఉప్పునుంతల వెల్టూర్లో కోతుల దాడిలో బూసిరాజ్ బాలమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. కోతుల బెడద తీవ్రమవ్వడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు.
Veltoor: వెల్టూర్ గ్రామంలో కోతుల బీభత్సం: వృద్ధురాలిపై దాడి, గాయాలు!
Veltoor: మండలంలోని వెల్టూర్ గ్రామంలో కోతులు విపరీతంగా పెరిగి రోజురోజుకు మనుషులపై దాడులు పాల్పడుతున్న సంఘటన వెల్టూర్ గ్రామంలో చోటుచేసుకుంది.
శనివారం ఉదయం గ్రామంలోని బస్టాండ్ ఆవరణలో ఉన్న బూసిరాజ్ బాలమ్మ ఇంట్లో నుండి బయటికి వెళ్లగానే దాదాపు నాలుగైదు కోతులు మీదకి పడి దాడి చేశాయి.
దీంతో ఆమె కాలుకు గాయాలు అయ్యాయి. లబోదిబో అంటూ అరిచిన చుట్టుపక్కల వాళ్ళు ఎవ్వరు లేకపోవడంతో భయంతో పరిగెత్తింది. అప్పటికే ఆమెను దాడి చేశాయి.
గ్రామంలో ఇప్పటికే పలువురి పై కోతులు దాడి చేసిన సంఘటనలు మరువకముందే పదేపదే ఇలా ఇండ్లలోకి వచ్చి బయటపెట్టి దాడులు చేయడంతో గ్రామస్తులు బిక్కుబిక్కున భయపడుతున్నారు.
కోతుల నుండి ఎప్పుడూ విముక్తి చేస్తారని గ్రామంలోని విమర్శిస్తున్నారు. గ్రామంలో బయటికి వెళ్ళాలంటే భయంతో వణుకుతున్నారని చెపుతున్నారు.
ఇప్పటికే గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియు సిబ్బంది పలువురు నేతలు ఒక్కరోజు తరిమిన లాభం లేదని వాటిని సంబధిత ఫారెస్ట్ అధికారులకు కానీ వాటిని పట్టే వారికి సమాచారం ఇచ్చి పట్టిస్తే తప్పా మార్గం లేదని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
గ్రామాల్లో కోతుల కుక్కల బెడతా ఎక్కువగా ఉండడం వాటి ద్వారా చిన్నారులు విద్యార్థులు బయటికి వెళ్లలేని పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా పాలకులు ప్రభుత్వ అధికారులు పట్టించుకొని వాటిని ఊర్లో నుండి తరిమి వేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.




