Nagarkurnool: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చైర్మన్ ప్రత్యేక చొరవ

Nagarkurnool: నాగర్‌కర్నూల్ మున్సిపల్ చైర్మన్ తీగల సునేందర్ కుమార్ విద్యుత్ శాఖ ఎస్‌ఈని కలిసి పట్టణంలోని లో-వోల్టేజ్, కొత్త స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్ల సమస్యలను వివరించారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 3 Sept 2026 8:50 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: విద్యుత్ సమస్యల పరిష్కారానికి చైర్మన్ ప్రత్యేక చొరవ

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ పట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారానికి మున్సిపల్ చైర్మన్ తీగల సునేందర్ కుమార్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. ఈ మేరకు విద్యుత్ శాఖ ఎస్‌ఈ కె.వి. నరసింహ రెడ్డిని కలిసి పట్టణంలోని విద్యుత్ సమస్యలను వివరించారు.

పట్టణంలోని పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా, లో-వోల్టేజ్ తదితర సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని కోరారు. అలాగే పోల్స్ అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో పాటు, అవసరమైన చోట్ల ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసి ప్రజలకు మెరుగైన విద్యుత్ సౌకర్యాలు కల్పించాలని ఎస్‌ఈని కోరారు.

చైర్మన్ వివరించిన సమస్యలను సానుకూలంగా పరిశీలించిన ఎస్‌ఈ నరసింహ రెడ్డి, సమస్యల పరిష్కారానికి త్వరితగతిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ బాదం రమేష్, కౌన్సిలర్లు శంకర్, పద్మమ్మ, శ్రీను, కాంగ్రెస్ నాయకులు అవాంచ రాజు, రాజేష్ గౌడ్, హరీష్ గౌడ్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

Next Story