Nagarkurnool: ప్రగతి నర్సింగ్ హోమ్‌లో నేడు ఉచిత గర్భిణుల వైద్య శిబిరం!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ ప్రగతి నర్సింగ్ హోమ్‌లో సోమవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఉచిత స్కానింగ్, మందులు పంపిణీ చేయనున్నట్లు డాక్టర్ నూర్జహాన్ తెలిపారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL
Published on: 1 Nov 2026 9:30 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: ప్రగతి నర్సింగ్ హోమ్‌లో నేడు ఉచిత గర్భిణుల వైద్య శిబిరం!

నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని ప్రగతి నర్సింగ్ హోమ్ లో సోమవారం గర్భిణీ స్త్రీలకు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు డాక్టర్ నూర్జహాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రముఖ స్త్రీ వైద్య నిపుణురాలు డాక్టర్ సృజన, డాక్టర్ నూర్జహాన్ లఆధ్వర్యంలో ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఈ శిబిరం నిర్వహించడం జరుగుతుందని ఆమె తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని గర్భిణీ స్త్రీలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. స్కానింగ్ తో పాటు ఉచితంగా మందులు కూడా ఇవ్వడం జరుగుతుందని డాక్టర్ నూర్జహాన్ తెలిపారు.

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL

GUNTI SAILU SAGAR, NAGAR KURNOOL