Veldanda: వెల్దండలో నూతన పింఛన్ల పంపిణీ చేసిన సర్పంచ్
Veldanda: నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ నూతన పింఛన్లు పంపిణీ చేశారు.
Veldanda: వెల్దండలో నూతన పింఛన్ల పంపిణీ చేసిన సర్పంచ్
వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ గ్రామ పంచాయతీ పరిధిలో అర్హులైన లబ్ధిదారులకు సోమవారం ఆసరా పింఛన్లు పంపిణీ చేశారు. గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ చేతుల మీదుగా వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, దివ్యాంగులు, గీత కార్మికులకు నూతన పింఛన్లు అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమం కోసం ప్రతి నెలా క్రమం తప్పకుండా పింఛన్లు అందిస్తోందని, అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనలో ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి కృషి వల్లే అర్హులైన ప్రతి ఒక్కరికి ఆసరా పింఛన్లు అందుతున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి గిరి గౌడ్, ఉప సర్పంచ్ బస్నమోని శ్రీనివాస్, సింగిల్ విండో డైరెక్టర్ కొయ్యల పుల్లయ్య, వార్డు సభ్యులు మల్లీశ్వరి రంగనాథం, కిష్టల్, వాణి పురుషోత్తం, కొండల్, మానస రాజు,మంజుల శ్రీనివాస్, కవిత రమేష్, వెంకటేష్, దేవేందర్, రమేష్ ,శేఖర్, రవీందర్ , సీనియర్ నాయకులు మండలమోని కృష్ణ, ఎండి రషీద్, టౌన్ కాంగ్రెస్ అధ్యక్షుడు బాదేపల్లి మల్లయ్య, తిరుపతి రెడ్డి, ఈదులపల్లి శ్రీను, రేవల్లి రాజు, మట్ట నాగరాజు, తదితరులు పాల్గొన్నారు.




