Nagarkurnool: వెల్దండలో మృతుని కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం!

Nagarkurnool: వెల్దండలో అనారోగ్యంతో మృతిచెందిన మాడుగుల సత్తయ్య కుటుంబాన్ని పరామర్శించిన సర్పంచ్ మట్ట యాదమ్మ. ₹5 వేల ఆర్థిక సాయం అందించి ధైర్యం చెప్పిన నాయకులు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 16 Sept 2026 10:19 AM IST
Nagarkurnool
X

Nagarkurnool: వెల్దండలో మృతుని కుటుంబానికి సర్పంచ్ ఆర్థిక సాయం!

Nagarkurnool: అనారోగ్యంతో మృతి చెందిన వెల్దండ మండల కేంద్రానికి చెందిన మాడుగుల సత్తయ్య కుటుంబాన్ని సర్పంచ్ మట్ట యాదమ్మ, మట్ట వెంకటయ్య గౌడ్ పరామర్శించారు. మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా అధైర్యపడవద్దని, కుటుంబానికి అండగా ఉంటామని భరోసా కల్పించారు.

అనంతరం మృతుని కుటుంబానికి రూ.5 వేల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి తమ వంతు సహాయం అందించడం అభినందనీయమని స్థానికులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ ఎర్ర శ్రీను, వార్డు సభ్యులు గుద్దేటి కిష్టాల్, పాలాది మల్లీశ్వరి, రంగనాథం, మారెపల్లి శ్రీను, మంజుల, కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ జిల్లా ఉపాధ్యక్షులు కొయ్యల పుల్లయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు తిరుపతిరెడ్డి, దర్గయ్య, కాంగ్రెస్ పార్టీ యువజన అధ్యక్షులు మట్ట భరత్ గౌడ్, మట్ట మల్లేష్ గౌడ్, ఈదులపల్లి రాజు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY