Nagarkurnool: క్రీడారంగంలో రికార్డు: తెప్ప శ్రీనివాస్‌ను సత్కరించిన మంత్రి!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ తైక్వాండో సంఘం అధ్యక్షుడు తెప్ప శ్రీనివాస్‌కు రాష్ట్ర క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రశంసా పత్రం, మెడల్ అందజేశారు.
Nagarkurnool: క్రీడారంగంలో రికార్డు: తెప్ప శ్రీనివాస్‌ను సత్కరించిన మంత్రి!
నాగర్‌కర్నూల్: తై క్వాండో అసోసియేషన్ నాగర్ కర్నూల్ జిల్లా ప్రెసిడెంట్ లయన్ డాక్టర్. తెప్ప శ్రీనివాస్ కు తెలంగాణ రాష్ట్ర క్రీడలు పశుసంవర్ధక శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రశంసా పత్రం, మెడల్ ను అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ లోని మినిస్టర్స్ క్వాటర్స్ లోని మినిస్టర్ ఛాంబర్ లో లయన్ డాక్టర్ తెప్ప శ్రీనివాస్ ను మంత్రివర్యులు వాకిటి శ్రీహరి ఘనంగా సన్మానించి, సత్కరించారు.
ఇటీవల గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన తై క్వాండో పోటీలో అత్యంత ప్రతిభ చూపి గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినదుకు క్రీడాల మంత్రి శ్రీ వాకిటి శ్రీహరిమెడల్ తో సన్మానించి, ప్రశంసా పత్రం అంద చేసారు. 35 సంవత్సరాలుగా మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తూ, మరియు టైక్వాండో క్రీడ అసోసియేషన్ నాగర్ కర్నూల్ ప్రెసిడెంట్ గా ఉంటూ, అనేక మంది యువతకు ఆదర్శనంగా ఉంటూ 55 సంవత్సరాల వయస్సులో లో కూడా గిన్నిస్ వరల్డ్ రికార్డు సాధించినందుకు గాను 16 సంవత్సరాలుగా లైన్స్ క్లబ్, ఇతర సేవా ఫౌండేషన్ ద్వారా సేవలు అందిస్తున్నందుకు గాను లయన్ తెప్ప శ్రీనివాస్ ను ప్రశంసించారు.
మంత్రిగ మాట్లాడుతూ ఈ ప్రభుత్వము క్రీడలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని, ఈ ప్రోత్సాహాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని, అలాగే క్రీడలు మరియు మార్షల్ ఆర్ట్స్ ద్వారా మనము ఎంతో ఆరోగ్యంగా ఉంటామని, ప్రతిరోజు ఒక గంట వ్యామము చేయాలని యువతకు సూచనలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యకార సంఘం అధ్యక్షుడు వాకిటి ఆంజనేయులు, జిల్లా డైరెక్టర్ తెప్ప బాబు, నాగనూలు సొసైటీ అధ్యక్షుడు తిరుపతయ్య, కాంగ్రెస్ నాయకులు, కేసరి సముద్రం సొసైటీ సభ్యులు తవిటి నిరంజన్, తెప్ప రుద్రయ్య, తెప్ప రాజేందర్ పాల్గొని హర్షం వ్యక్తం చేశారు, టైక్వాండో అసోసియేషన్ జిల్లా సెక్రెటరీ మాస్టర్ రవి, జిల్లా ట్రెజరర్ మాస్టర్ స్వాతి, మరియు విద్యార్థులు హర్షం వ్యక్తం వ్యక్తం చేసి అభినందన తెలిపారు.




