Nagarkurnool: వంగూరులో మృతుడి కుటుంబానికి బీఆర్‌ఎస్ నాయకుల అండ!

Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరులో అనారోగ్యంతో మృతి చెందిన బండపల్లి రమేష్ కుటుంబాన్ని మాజీ సర్పంచ్ వేనేపల్లి గణేష్ రావు పరామర్శించి రూ.10 వేల ఆర్థిక సాయం అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 26 Oct 2026 6:50 PM IST
Nagarkurnool
X

Nagarkurnool: వంగూరులో మృతుడి కుటుంబానికి బీఆర్‌ఎస్ నాయకుల అండ!

నాగర్‌కర్నూల్: నాగర్‌కర్నూల్ జిల్లా వంగూరు మండల కేంద్రానికి చెందిన బండపల్లి రమేష్ (30) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందాడు. విషయం తెలుసుకున్న మాజీ సర్పంచ్, బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకుడు వేనేపల్లి గణేష్ రావు, మాజీ సర్పంచ్ అక్కి లావణ్య ఎల్లాగౌడ్, గ్రామ ఉపసర్పంచ్ బండపల్లి భాస్కర్ మృతుని కుటుంబాన్ని పరామర్శించారు.

మృతుని ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ కుటుంబ సభ్యులకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.

ఈ కార్యక్రమంలో గ్రామ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు బండపల్లి జంగయ్య, వార్డు సభ్యులు సుమన్, అక్కి మురళీ, నారమోని జంగయ్య, బండపల్లి శివకుమార్, లట్టుపల్లి మురళి, సోషల్ మీడియా ఇన్‌చార్జి ఎల్లికంటి మురళి, అయినాల రమేష్, బాషమోని కృష్ణ, దామోదర్, రమేష్, బండపల్లి శ్రీశైలం, బుచ్చిరాములు, శ్రీశైలం, సి. లక్ష్మయ్య, భాషమోని వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY