Veldanda: వెల్దండలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకలు!
Veldanda: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించి, చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Veldanda: వెల్దండలో ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకలు!
వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలో బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి మహాత్మా జ్యోతిరావుపూలే ఆశయాలను అందరూ కొనసాగించాలని బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య అన్నారు వెల్దండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం దగ్గర బిఆర్ఎస్ పార్టీ నాయకులు పూలే వర్ధంతిని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ మాజీ మండల అధ్యక్షులు కానుగుల జోగయ్య మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతికి పూలే ఎనలేని కృషి చేశారన్నారు. పూలే ఆశయాల సాధనకు కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో వెల్దండ మాజీ ఎంపీటీసీ లింగం గుత్తి వెంకటయ్య కుప్పగండ్ల మాజీ సర్పంచ్ మొక్తాల శేఖర్ వార్డు నెంబర్ సభ్యులు జంగిలి సునీత ఆనంద్ బిఆర్ఎస్ పార్టీ యువ నాయకులు జంగిలి ప్రవీణ్ జంగిలి శ్రీనివాసులు జంగిలి రవికుమార్ మట్ట శ్రీనివాస్ గౌడ్ దాసరి బాలయ్య రాజు నాయక్ జగన్ నాయక్ తదితరులు పాల్గొన్నారు.




