Veldanda: వెల్దండ మండలం కోట్ర తండాలో 8 ఏళ్ల బాలుడు అదృశ్యం!

Veldanda: వెల్దండ మండలం కోట్ర తండాలో 8 ఏళ్ల బాలుడు ఆర్యన్ అదృశ్యం. బీహార్‌కు చెందిన వలస కార్మికుల కుమారుడు. ఆచూకీ తెలిస్తే సమాచారం ఇవ్వాలని వెల్దండ పోలీసుల విజ్ఞప్తి.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Sept 2026 7:49 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండ మండలం కోట్ర తండాలో 8 ఏళ్ల బాలుడు అదృశ్యం!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గం వెల్దండ మండలం బీహార్‌కు చెందిన గౌతమ్ సింగ్, ఆయన భార్య సావిత్రి దేవి గత ఎనిమిది నెలలుగా నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కోట్ర తండాకు చెందిన నేనావత్ సోములు వద్ద ఆవుల షెడ్డులో పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నారు.

వీరికి ముగ్గురు సంతానం వారి పెద్ద కుమారుడు ఆర్యన్ (8) కోట్ర గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మొదటి తరగతి చదువుతున్నాడు. కాగా ఆర్యన్ మంగళవారం మధ్యాహ్నం 3 గంటల సమయంలో తాము నివసిస్తున్న ఇంటి వద్ద నుంచి కనిపించకుండా పోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

బాలుడి ఆచూకీ తెలిసిన వారు లేదా బాలుడిని ఎక్కడైనా గుర్తించిన వారు వెంటనే వెల్దండ పోలీసులకు సమాచారం అందించాలని తెలిపారు.

వెల్దండ ఎస్‌ఐ: 8712657756

సీఐ: 8712657755.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY