Veldanda: వెల్దండలో వైభవంగా వినాయక పూజ, అన్నదానం!

Veldanda: వెల్దండలో ఘనంగా వినాయక పూజ, అన్నదాన కార్యక్రమం: ముఖ్య అతిథిగా పాల్గొన్న సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్. మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్ ఆధ్వర్యంలో పూజలు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 23 Sept 2026 11:46 PM IST
Veldanda
X

Veldanda: వెల్దండలో వైభవంగా వినాయక పూజ, అన్నదానం!

వెల్దండ: నాగర్ కర్నూల్ జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మి చెన్నకేశవ స్వామి భక్త బృందం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయక మండపంలో వెల్దండ మాజీ ఎంపీటీసీ చలిచీమల జ్యోతి నిరంజన్ నిర్వహించిన గణనాథుని పూజా కార్యక్రమానికి ముఖ్య అతిథుగా గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం భక్తులకు ఏర్పాటుచేసిన అన్న ప్రసాద వితరణ కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రసాదాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణనాథుడిని ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలి ప్రార్థించారు. అనంతరం మాజీ ఎంపీటీసీ జ్యోతి నిరంజన్ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న వివిధ నాయకులను శాలువులతో ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బట్ట భరత్ గౌడ్, వార్డ్ మెంబర్లు కిష్టాల్, మసిగుండ్ల వెంకటేష్, యూత్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు జంగిలి ఆనంద్ రాజ్, భరత్, నాని, చిన్న, డేవిడ్, చింటూ, రాములు, నిరంజన్, కుటుంబ సభ్యులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY