Veldanda: పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలి: సర్పంచ్!

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండల తహసీల్దార్ కార్తీక్ కుమార్‌కు గ్రాడ్యుయేట్ ఓటరు నమోదు దరఖాస్తులను సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ అందజేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Updated on: 30 Oct 2026 2:09 PM IST
Veldanda
X

Veldanda: పట్టభద్రులు ఓటు హక్కు వినియోగించుకోవాలి: సర్పంచ్!

వెల్దండ: నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంప్రతి గ్రాడ్యుయేట్ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని గ్రామ సర్పంచ్ మట్ట యాదమ్మ వెంకటయ్య గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం వెల్దండ మండల తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ బి. కార్తీక్ కుమార్ కి గ్రాడ్యుయేట్ ఓటు నమోదు పత్రాలను అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ... పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ గ్రాడ్యుయేట్ ఓటరుగా నమోదు చేసుకోవడం తమ బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనదని తెలిపారు. గ్రామంలోని అర్హులైన పట్టభద్రులందరూ ముందుకు వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు.

గ్రాడ్యుయేట్ ఓటు నమోదుకు చివరి తేదీ లోపు అర్హులందరూ దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు కొయ్యల పుల్లయ్య, రేవల్లి రాజు, బొక్కల శ్రీను , మట్ట మల్లేష్ తదితరులు పాల్గొన్నారు

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY