Veldanda: గుప్తనిధుల కోసం పొలంలో తవ్వకాలు: కేసు నమోదు!

Veldanda: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం నాగరావుపల్లి తండా సమీపంలో గుప్తనిధుల కోసం శివలింగం పక్కన అర్ధరాత్రి తవ్వకాలు జరిపారు. బాధితుడి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు.

SRI SAILAM, KALWAKURTHY
Published on: 1 Nov 2026 8:57 PM IST
Veldanda
X

Veldanda: గుప్తనిధుల కోసం పొలంలో తవ్వకాలు: కేసు నమోదు!

వెల్దండ: నాగర్ కర్నూల్ వెల్దండ మండలం రాగాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని నాగరావుపల్లి తండా సమీపంలో గుప్తనిధుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు ఎస్సై యుగంధర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ నాగరావుపల్లి తండాకు చెందిన ఇస్లావత్ శీను ఈనెల 29న ఉదయం 8 గంటల సమయంలో తన వ్యవసాయ పొలానికి వెళ్లి పరిశీలించగా, పొలంలోని చిన్న రాళ్లగుట్టపై ఉన్న శివలింగం పక్కన గుంత తవ్విన ఆనవాళ్లు కనిపించాయని గుర్తుతెలియని వ్యక్తులు ఈనెల 28వ తేదీ రాత్రి సమయంలో గుప్తనిధుల కోసం పూజలు నిర్వహించి.

సుమారు ఐదు అడుగుల లోతు గుంత తవ్వి తిరిగి పూడ్చివేసినట్లు అనుమానం వ్యక్తం చేశారు. ఆదివారం వెల్దండ పోలీస్‌ స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు గుర్తుతెలియని వ్యక్తులపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు తెలిపారు.

SRI SAILAM, KALWAKURTHY

SRI SAILAM, KALWAKURTHY