Nagarkurnool: యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో అధునాతన వైద్య సేవలపై ప్రెస్ మీట్
Nagarkurnool: సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కృష్ణ చౌదరి మాట్లాడుతూ రోబోటిక్, లాప్రోస్కోపిక్ విధానాలతో క్లిష్టమైన సర్జరీలు సులభంగా చేస్తున్నట్లు తెలిపారు.
Nagarkurnool: యశోద ఆసుపత్రి ఆధ్వర్యంలో అధునాతన వైద్య సేవలపై ప్రెస్ మీట్
నాగర్ కర్నూలు: రోబోటిక్, అడ్వాన్స్‌డ్ లాప్రోస్కోపిక్ సర్జరీలతో క్లిష్టమైన శస్త్రచికిత్సలను సైతం సులభంగా నిర్వహిస్తున్నట్లు సికింద్రాబాద్ యశోద ఆసుపత్రి గ్యాస్ట్రో ఎంటరాలజీ నిపుణులు డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో నిర్వహించిన ప్రెస్ మీట్ లో వారు మాట్లాడుతూ సాధారణంగా 24 గంటల వరకు సమయం పట్టే అత్యంత క్లిష్టమైన పేగు ఆపరేషన్లను కూడా అధునాతన లాప్రోస్కోపిక్ విధానంలో విజయవంతంగా నిర్వహించగల సామర్థ్యం ఆసుపత్రిలో ఉందన్నారు.
కిడ్నీ, అండాశయం (ఓవరీ), గ్యాస్ట్రో ఎంటరాలజీకి సంబంధించిన క్లిష్ట సమస్యలకు రోబోటిక్ టెక్నాలజీ ద్వారా అత్యాధునిక చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు. ఈ విధానాల్లో కోత చాలా తక్కువగా ఉండటంతో ఆపరేషన్ అనంతరం రోగులు త్వరగా కోలుకుని తక్కువ సమయంలోనే సాధారణ కార్యకలాపాలకు చేరుకునే అవకాశం ఉంటుందని వివరించారు.
రోబోటిక్, లాప్రోస్కోపిక్ చికిత్సలకు హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజ్ వర్తిస్తుందని, రోగులు ఆర్థిక భారం గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డాక్టర్ కృష్ణ చౌదరి తెలిపారు. ప్రజలు అందుబాటులో ఉన్న అత్యాధునిక వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో యశోద ఆసుపత్రి మార్కెటింగ్ మేనేజర్లు సుదర్శన్ రెడ్డి, రాజు తదితరులు పాల్గొన్నారు.




