Nagarkurnool: 12 గంటల్లో 117 కి.మీ. పరుగు.. నల్లమల్ల బిడ్డ అరుదైన ఘనత!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా అచ్చంపేట చెంచుపల్గు తండాకు చెందిన మేఘావత్ నారాయణ 12 గంటల్లో 117 కిలోమీటర్లు పరుగెత్తి సత్తా చాటారు.
Nagarkurnool: 12 గంటల్లో 117 కి.మీ. పరుగు.. నల్లమల్ల బిడ్డ అరుదైన ఘనత!
Nagarkurnool: నాగర్‌కర్నూల్ జిల్లా, అచ్చంపేట మండలం, చెంచుపల్గు తండాకు చెందిన సాధారణ గిరిజన రైతు కుటుంబ బిడ్డ మేఘావత్ నారాయణ. తండ్రి మేఘావత్ లచ్చ, తల్లి మేఘావత్ బుజ్జి దంపతుల ప్రథమ కుమారుడు.
12 గంటల పాటు నిరంతరాయంగా 117 కిలోమీటర్లు పరుగెత్తి ప్రథమ బహుమతి సాధించడం ఆయన పట్టుదల, కఠోర శ్రమ, అంకితభావానికి నిదర్శనం.
గ్రామీణ ప్రాంతం నుంచి ఎదిగి క్రీడా రంగంలో అద్భుత ప్రతిభ చాటిన నారాయణ విజయం గిరిజన, గ్రామీణ యువతకు గొప్ప స్ఫూర్తి. కష్టపడితే అసాధ్యాన్ని సైతం సుసాధ్యం చేయవచ్చని తన విజయంతో నిరూపించారు.
భవిష్యత్తులో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మరిన్ని విజయాలు సాధించి నల్లమల్ల ప్రాంతానికి, గిరిజన సమాజానికి గొప్ప పేరు తీసుకురావాలని ఆకాంక్షిస్తూ
మేఘావత్ నారాయణకు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు!
NARAYANA ATHLETICS ACADEMY
దిల్ సుఖ్‌నగర్ – విక్టోరియా గ్రౌండ్, హైదరాబాద్.




