Narayanpet: పసికందును డ్రైనేజీ పక్కన వదిలేసి వెళ్లిన అపరిచితులు
Narayanpet: నారాయణపేట జిల్లా కృష్ణా రైల్వే స్టేషన్‌లో ఘోరం. 10 రోజుల పసికందును డ్రైనేజీ పక్కన వదిలి వెళ్లిన కర్కషులు.
Narayanpet: పసికందును డ్రైనేజీ పక్కన వదిలేసి వెళ్లిన అపరిచితులు
Narayanpet: కృష్ణా మండల కేంద్రంలోని కృష్ణా రైల్వే స్టేషన్‌లో గుర్తుతెలియని వ్యక్తులు పది రోజుల పసికందు (బాబును) వదిలి వెళ్లిన ఘటన కలకలం రేపింది.రైల్వే స్టేషన్‌లో పసికందును గుర్తించిన స్థానికులు వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించారు.
సమాచారం అందుకున్న అధికారులు, సిబ్బంది అక్కడికి చేరుకుని శిశువును సంరక్షణలోకి తీసుకున్నారు, అనంతరం మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పసికందుకు చికిత్స నిర్వహిస్తున్నారు, పసికందును ఎవరు వదిలి వెళ్లారు అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story




