Narayanpet: ఆశా వర్కర్లకు రూ.18,000 జీతం ఇవ్వాలి
Narayanpet: నారాయణపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్‌లో ఆశా వర్కర్ల వినతిపత్రం అందజేత. రూ.18,000ల ఫిక్స్డ్ వేతనం, పిఎఫ్, ఈఎస్ఐ కల్పించాలని సమ్మె నోటీస్ జారీ.
Narayanpet: ఆశా వర్కర్లకు రూ.18,000 జీతం ఇవ్వాలి
నారాయణపేట: నారాయణపేటజిల్లా తెలంగాణ రాష్ట్ర పిలుపులో భాగంగా తెలంగాణ ఆశ వర్కర్ యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో ఈరోజు నారాయణపేట జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో ఎమ్మెల్యే శ్రీమతి చిట్టెం పర్ణికారెడ్డి పి ఏ మాధవరెడ్డికి వినతి పత్రం అందిస్తూ తెలంగాణ ఆశ వర్కర్ యూనియన్ (సిఐటియు) జిల్లా అధ్యక్ష కార్యదర్శులు బాలమణి, అనురాధ, సిఐటియు జిల్లా నాయకులు నరహరి మాట్లాడుతూ .
రాష్ట్రంలో ఆశా వర్కర్లు 28 వేల మంది గత 20 సంవత్సరాల నుండి పనిచేస్తున్నారు. వీరంతా బడుగు, బలహీన వర్గాలకు చెందిన మహిళలు, రూరల్ 1,000, పట్టణంలో 2,000 నుండి 5,000 మంది ప్రజలకు ఆశాలు సేవలందిస్తున్నారు. గర్భిణీలు ఆసుపత్రిలో డెలివరీ అయ్యే విధంగా చూస్తూ తల్లి, బిడ్డ ప్రాణాలను కాపాడటంలో కీలకపాత్ర పోషిస్తున్నారు. దీంతోపాటు సీజనల్ వ్యాధులు, అంటువ్యాధులు దీర్ఘకాలిక వ్యాధులను అరికడుతున్నారు. కరోనా మహమ్మారిని కట్టడి చేయడంలో ఆశాలు కీలకపాత్ర పోషించారు.
డబ్ల్యూహెచ్ఓ ఆశాలను గ్లోబల్ లీడర్స్ అని ప్రకటించింది. ఉదయం 9 నుండి సాయంత్రం 4 గంటల వరకు సబ్ సెంటర్ డ్యూటీలు, ఏఎన్సీ, పిఎన్సి, టార్గెట్స్, ఎన్సిడి ఆన్లైన్ సర్వే, స్పూటమ్ డబ్బాలను మోయడం, ఎగ్జామ్ డ్యూటీలు, డ్రై డే, ఫ్రైడే లెప్రసీ, పల్స్ పోలియో తదితర అనేక పనులు ఉదయం నుండి రాత్రి వరకు చేస్తున్నారు.
ఇంత శ్రమ చేస్తున్న ఆశాలకు నేటికీ రాష్ట్రంలో ఫిక్స్డ్ వేతనం లేదు. కేవలం రూ.9,900/-లు మాత్రమే పారితోషికాలు చెల్లిస్తున్నారు. ఇతర ఏ సౌకర్యాలు లేవు. 5 సంవత్సరాల నుండి పారితోషికాలు పెరగలేదు. నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. పని భారం పెరిగి వచ్చే పారితోషికాలు సరిపోక ఆశాలు అనేక ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆశాలు సమస్యల పరిష్కారం కోసం 2023 సెప్టెంబర్ 25 నుండి అక్టోబర్ 9 వరకు రాష్ట్రవ్యాప్తంగా 15 రోజులు నిరవధిక సమ్మె చేశారు. సమ్మె సందర్భంగా అక్టోబర్ 9న హైదరాబాద్ కోఠి కమీషనర్ ఆఫీస్ ముందు జరిగిన ధర్నా సందర్భంగా గత ప్రభుత్వం ఆనాటి ఉన్నతాధికారులు నాయకులతో చర్చలు జరిపారు. ఆశాల సమస్యల పరిష్కారం కోసం ఐఏఎస్ తో కూడిన కమిటీని వేస్తామని, ఈ కమిటీ ఆశాల సమస్యల పరిష్కారం
కోసం కృషి చేస్తుందని హామీ ఇచ్చారు. అనంతరం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఆశాలకు వేతనాలు పెంచుతామని, ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీనిచ్చారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ నాయకులు ఆశాలు చేస్తున్న పోరాటంలో ప్రత్యక్షంగా పాల్గొని మేము అధికారంలోకి వస్తే ఆశాలు అడుగుతున్న డిమాండ్స్ అన్నింటినీ పరిష్కారం చేస్తామని హామీనిచ్చారు.
ఆశాలకు గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, రాష్ట్రంలో ఆశాలు అనేక పోరాటాలు చేశారు. హైదరాబాద్ కోఠి కమీషనర్ ఆఫీస్ వద్ద చేసిన పోరాటాల సందర్భంగా 2024 ఫిబ్రవరి 9న జూలై 30న డిసెంబర్ 10న రాష్ట్ర ఉన్నతాధికారులు ఆశాలకు రూ.50 లక్షల ఇన్సూరెన్స్, రూ.50,000/-ల మట్టి ఖర్చులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, సెలవులు, టార్గెట్స్, స్పూటమ్ డబ్బాలు మోయడం రద్దు, ప్రమోషన్స్ సౌకర్యం కల్పిస్తామని, రూ.18,000/- ల ఫిక్స్డ్ వేతనం కోసం ఫైల్ ప్రాసెస్‌లో ఉందని చెప్పారు. కానీ ఇప్పటివరకు ఇచ్చిన హామీలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయలేదు. అందుకని పారిశ్రామిక వివాదాల చట్టం-1947లోని సెక్షన్-22, సబ్ సెక్షన్(1)ని అనుసరించి ఈ సమ్మె నోటీస్ ఇస్తున్నాము.
ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆశ వర్కర్ సిఐటియు నాయకురాలు నారాయణపేట నియోజకవర్గం ఆశా యూనియన్ నేతలు శ్రీదేవి, నిర్మల,ఉమ, భాగ్యమ్మ, పార్వతమ్మ, బాలనర్సమ్మ, మహేశ్వరి, కృష్ణ వేణి, శాంతి, మంగమ్మ, నర్సమ్మ, యాదమ్మ, సుజాత, చంద్రకళ, సుమిత్ర, లక్ష్మి, నీలమ్మ, కవిత, వెంకటేశ్వరి, రమ్య తదితరులు పాల్గొన్నారు. నారాయణపేట, ధన్వాడ, మరికల్, దామరగిద్ద మండలాల నుండి 50 మందికి పైగా ఆశ వర్కర్లు పాల్గొనడం జరిగింది.




